Vivo V70 Series : కొత్త వివో ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ఈసారి ఫీచర్లు మాత్రం ఓ రేంజ్లో అంతే.. ధరపై భారీ అంచనాలు
Vivo V70 Series : వివో నుంచి రెండు సరికొత్త ఫోన్లు రాబోతున్నాయి. వివో V70 ఎలైట్, వివో V70 ఫోన్లు ఈ నెల 19న భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి.. ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
Vivo V70 Series
- వివో V70, వివో V70 ఎలైట్ ఫిబ్రవరి 19న భారత్ మార్కెట్లో లాంచ్
- ఈ రెండు ఫోన్లు పర్ఫార్మెన్స్, భారీ బ్యాటరీలు, అడ్వాన్స్ కెమెరాలతో రావచ్చు
- ధర దాదాపు రూ.45,999 నుంచి ప్రారంభం, ఎలైట్ మోడల్ ధర ఎక్కువ ఉండొచ్చు
Vivo V70 Series : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి వివో నుంచి కొత్త V సిరీస్ వచ్చేస్తోంది. వివో ఈ సిరీస్ లైనప్‌లో వివో వి70, వివో వి70 ఎలైట్ అనే రెండు మోడళ్లు లాంచ్ కానున్నాయి. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
చైనీస్ బ్రాండ్ కూడా రెండు ఫోన్లకు సంబంధించి కీలక వివరాలను వెల్లడించింది. ఈ రెండు మోడళ్లలో ఫొటోగ్రఫీ కోసం జీస్ కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లు, అదనపు అడ్వాన్స్ ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. వివో V70, V70 ఎలైట్ ఫోన్లు లాంచ్ తేదీ, స్పెషిఫికేషన్లు, ధరతో సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వివో V70 ఎలైట్, వివో V70 భారత్ లాంచ్ తేదీ ( అంచనా) :
భారత మార్కెట్లో వివో V70, వివో V70 ఎలైట్ ఫోన్లు ఫిబ్రవరి 19, 2026న అధికారికంగా లాంచ్ కానున్నాయి. ఈ లాంచ్ ఈవెంట్‌ను యూట్యూబ్, వివో అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌లలో మధ్యాహ్నం 12 గంటల నుంచి లైవ్ చూడవచ్చు. అంతేకాకుండా, ఈ వివో ఫోన్లు అమెజాన్, వివో అధికారిక ఆన్లైన్ స్టోర్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
వివో V70 ఎలైట్ స్పెషిఫికేషన్లు (అంచనా) :
వివో V70 ఎలైట్ ఫోన్ 6.59-అంగుళాల OLED డిస్ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని భావిస్తున్నారు. డైరెక్ట్ సన్ లైట్ లో కూడా ఈ ఫోన్ 5,000 నిట్స్ టాప్ బ్రైట్ నెస్ అందిస్తుందని భావిస్తున్నారు. హుడ్ కింద, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో రావచ్చు. ఇంకా, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.
ఈ స్మార్ట్‌ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 లేదా IP69 రేటింగ్ కూడా పొందవచ్చు. ఆప్టిక్స్ పరంగా ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP నైట్ టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో ట్రిపుల్ సెటప్ అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ వివో ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాతో వస్తుందని చెబుతున్నారు. వివో V70 ఎలైట్ ప్యాషన్ రెడ్, సాండ్ బీజ్, అథెంటిక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో రావచ్చు.
వివో V70 స్పెసిఫికేషన్లు (అంచనా) :
స్టాండర్డ్ వివో V70 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల OLED డిస్ప్లేతో వచ్చే అవకాశం ఉంది. ఈ వివో ఫోన్ హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ నుంచి పవర్ పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌లో 6,500mAh బ్యాటరీ కూడా ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని అంచనా.
ఈ వివో ఫోన్ విషయానికి వస్తే.. హై క్వాలిటీ ఫొటోల కోసం జైస్-ట్యూన్డ్ లెన్స్ ఉండొచ్చు. 50MP మెయిన్ సెన్సార్, 50MP నైట్ టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. వివో V70 ప్యాషన్ రెడ్, లెమన్ ఎల్లో కలర్ ఆప్షన్లలో లాంచ్ అవుతుందని అంచనా.
వివో V70, వివో V70 ఎలైట్ భారత్ ధర (అంచనా) :
లీక్‌లు, రిపోర్టుల ప్రకారం.. స్టాండర్డ్ వివో V70 ధర దాదాపు రూ.45,999 కావచ్చు. అయితే, వివో V70 ఎలైట్ ధర రూ.50వేల నుంచి రూ.55వేల మధ్య ఉండవచ్చు. అయితే, ఫైనల్ ధర లాంచ్ సమయంలో మారవచ్చు.
