Rana Daggubati : సినిమా కలెక్షన్స్ పై రానా సంచలన వ్యాఖ్యలు.. పోస్టర్స్ పై కలెక్షన్స్ రియల్ కాదు అంటూ..

స్టార్ హీరోల సినిమాలు అయితే వందల కోట్లు వచ్చాయని పోస్టర్స్ వేస్తారు.

Rana Daggubati : సినిమా కలెక్షన్స్ పై రానా సంచలన వ్యాఖ్యలు.. పోస్టర్స్ పై కలెక్షన్స్ రియల్ కాదు అంటూ..

Rana Daggubati

Updated On : November 19, 2024 / 10:12 AM IST

Rana Daggubati : చాలా మంది తమ సినిమాలకు ఇన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి అని చూపించుకోడానికి అధికారికంగానే పోస్టర్స్ రిలీజ్ చేస్తారు. స్టార్ హీరోల సినిమాలు అయితే వందల కోట్లు వచ్చాయని పోస్టర్స్ వేస్తారు. ఫ్యాన్స్ కూడా తమ హీరోలకు అన్ని వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయని గర్వంగా చెప్పుకుంటారు. అయితే ఒక్కోసారి అవి ఫేక్ కలెక్షన్స్ అని, కొంతమంది ప్రెస్టేజి కోసం కలెక్షన్స్ వచ్చినట్టు పోస్టర్స్ వేస్తారని అప్పుడప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి.

Also Read : Ram Charan : వామ్మో ఆ జనాలు ఏందిరా బాబు.. కడపలో రామ్ చరణ్.. భారీగా వచ్చిన ఫ్యాన్స్.. ఫోటోలు, వీడియోలు వైరల్..

తాజాగా రానా దగ్గుబాటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాక్సాఫీస్ నంబర్లు అనేది ఒక కామెడీ విషయం. చాలా మందికి తెలుసో లేదో పోస్టర్స్ లో నంబర్స్ అనేది టైం పాస్ కి వేస్తారు. అవి రియల్ నంబర్స్ కాదు. జస్ట్ మార్కెటింగ్ కోసం వేస్తారు. వచ్చే గ్రాస్ కి ఫైనల్ గా వచ్చే డబ్బులకు సంబంధం ఉండదు అని అన్నారు. దీంతో రానా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రానా చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చగా మారగా ఫ్యాన్స్ ఏమో అయితే మా హీరోలకు వచ్చిన కోట్ల కలెక్షన్స్ నిజం కాదా అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక రానా ఓ పక్క సినిమాలతో బిజీగానే ఉంటూ ఇప్పుడు కొత్త టాక్ షోతో రాబోతున్నాడు. రానా హోస్ట్ గా ది రానా దగ్గుబాటి షో అనే పేరుతో అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 23 నుంచి టాక్ షో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ఈ షో ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా.. ఇందులో ఆర్జీవీ, రాజమౌళి, నాగ చైతన్య, శ్రీలీల, సిద్ధూ జొన్నలగడ్డ, రిషబ్ శెట్టి.. ఇలా చాలా మంది స్టార్స్ వచ్చారు.