Radhe Shyam: “రెబల్ స్టార్” ప్రభాస్ హీరోగా గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, ‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం “రాధేశ్యామ్”. ‘బాహుబలి1, బాహుబలి2 , సాహో’ వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా ఇది.
డార్లింగ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని డాక్టర్ యూ.వి. కృష్ణంరాజు సమర్పిస్తుండగా, వంశీ, ప్రమోద్, ప్రసీద ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో పలు హిట్ చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేసిన జస్టిన్ ప్రభాకరన్ “రాధేశ్యామ్” మూవీకి సంగీతదర్శకునిగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఇటలీ వీధుల్లో చిన్నారులతో ప్రభాస్ ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్‌ని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా “బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్” పేరిట మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నారు.