Regina Cassandra : పెళ్లి చేసుకుంటానో లేదో తెలీదు.. నా ప్రేమ 2020 లోనే ముగిసిపోయింది
రెజీనా పెళ్లి గురించి టాపిక్ రాగా ప్రేమ, పెళ్లి అంశాలపై స్పందించింది. రెజీనా మాట్లాడుతూ.. ''నా ప్రేమ 2020లోనే ముగిసింది. దాని నుంచి బయటకి రావడానికి కొంచెం సమయం కూడా పట్టింది. ప్రస్తుతం నేను ఎవ్వర్నీ..............
- Saketh U
- Published On : September 10, 2022 / 08:39 AM IST
Regina Cassandra spoke about her love and marriage
Regina Cassandra : తమిళ్ సినిమాతో పరిశ్రమకి పరిచయమై, తెలుగులో SMS సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుసగా తమిళ్, తెలుగు సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది రెజీనా కసాండ్ర. ఇప్పుడు కూడా తమిళ్, తెలుగు సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లతో బిజీగానే ఉంది. త్వరలో నివేద థామస్ తో కలిసి శాకిని డాకిని సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది రెజీనా. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.
Ishaan Khattar : అవును నేను సింగిల్.. లైగర్ బ్యూటీతో విడిపోయాను అంటున్న బాలీవుడ్ హీరో
ఈ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో రెజీనా పెళ్లి గురించి టాపిక్ రాగా ప్రేమ, పెళ్లి అంశాలపై స్పందించింది. రెజీనా మాట్లాడుతూ.. ”నా ప్రేమ 2020లోనే ముగిసింది. దాని నుంచి బయటకి రావడానికి కొంచెం సమయం కూడా పట్టింది. ప్రస్తుతం నేను ఎవ్వర్నీ ప్రేమించడంలేదు. అసలు ప్రేమ, పెళ్లి లాంటి విషయాలపై మాట్లాడటానికే నాకు ఇష్టం లేదు. జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదు. ఎదుటివారిపై ఆధారపడకుండా సొంతంగా జీవించాలని మా అమ్మ చిన్నప్పుడే నేర్పించింది. జీవితంలో నాకు తోడు కావాలా, వద్దా అనే విషయంపై నేను అసలు ఆలోచించదలుచుకోలేదు” అని తెలిపింది. ఇప్పటికే 30 ఏళ్ళు దాటిన రెజీనా భవిష్యత్తులో అయినా పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి.
