Ishaan Khattar : అవును నేను సింగిల్.. లైగర్ బ్యూటీతో విడిపోయాను అంటున్న బాలీవుడ్ హీరో

కొన్ని రోజుల నుంచి అనన్య-ఇషాన్ విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో అంతా వీరిద్దరూ విడిపోయారు అనుకుంటున్నారు. దీనిపై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించలేదు. తాజాగా ఇషాన్ ఖట్టర్ వీరి రిలేషన్ పై మాట్లాడాడు...........

Ishaan Khattar : అవును నేను సింగిల్.. లైగర్ బ్యూటీతో విడిపోయాను అంటున్న బాలీవుడ్ హీరో

Ishaan Khattar and ananya panday breaks their relationship

Updated On : September 10, 2022 / 8:17 AM IST

Ishaan Khattar :  ఇటీవల లైగర్ సినిమాతో సౌత్ ప్రేక్షకులని కూడా పలకరించింది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. ఖాళీ పీలి సినిమా నుంచి అనన్య.. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు, ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న ఇషాన్ ఖట్టర్ తో కొన్నేళ్లు ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ కొన్నేళ్లు డేటింగ్ చేసారని కూడా వార్తలు వచ్చాయి. బాలీవుడ్ ఫంక్షన్స్ కి, పార్టీలకి వీరిద్దరూ జంటగా వెళ్లి అనేకసార్లు మీడియాకి చిక్కారు.

అయితే కొన్ని రోజుల నుంచి అనన్య-ఇషాన్ విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో అంతా వీరిద్దరూ విడిపోయారు అనుకుంటున్నారు. దీనిపై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించలేదు. తాజాగా ఇషాన్ ఖట్టర్ వీరి రిలేషన్ పై మాట్లాడాడు. ఇటీవల కత్రినా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఇషాన్‌ ఖట్టర్‌ ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నాడు.

Brahmastra Review : బ్రహ్మాస్త్ర రివ్యూ.. కేవలం విజువల్ ఫీస్ట్ మాత్రమేనా??

ఈ షోలో కరణ్ జోహార్ పర్సనల్ ప్రశ్నలే ఎక్కువగా అడుగుతాడని తెలిసిందే. కరణ్ ఇషాన్ ని ఉద్దేశించి నువ్వు అనన్యతో విడిపోయావు కదా అని డైరెక్ట్ గా అడిగేశాడు. దీనికి ఇషాన్ సమాధానమిస్తూ.. ”అవును. ప్రస్తుతానికి నేను సింగిల్. అనన్యతో జీవితాంతం ఆమెకు స్నేహితుడిగా ఉండాలని అనుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్లలో మోస్ట్‌ స్వీటెస్ట్‌ పర్సన్‌ అనన్య” అని చెప్పాడు. దీంతో వీరిద్దరూ విడిపోయారని క్లారిటీ వచ్చేసింది.