Renu Desai : అకీరాపై రేణు దేశాయ్ కలలు ఏంటో తెలుసా.. నా కొడుకుని అలా చూడాలని ఉంది..
పవన్ తనయుడు అకిరా(Akira Nandan) హీరో అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అకీరాకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని, హీరో అవ్వడని ఆల్రెడీ రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది.
- Saketh U
- Published On : October 13, 2023 / 12:38 PM IST
Renu Desai Dreams about her Son Akira Nandan
Renu Desai : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్యగా, నటిగా రేణు దేశాయ్ అందరికి సుపరిచితమే. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా అందరికి అందుబాటులో ఉంటుంది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ రవితేజ(Raviteja) టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో హేమలత లవణం అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ ని ప్లే చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించగా సినిమాతో పాటు పలు ఆసక్తికర విషయాలని కూడా తెలిపింది.
పవన్ తనయుడు అకిరా(Akira Nandan) హీరో అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అకీరాకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని, హీరో అవ్వడని ఆల్రెడీ రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అకిరా అమెరికాలోని ఓ ఫిలిం స్కూల్ లో మ్యూజిక్, ఇంకొన్ని కోర్సులు నేర్చుకుంటున్నాడు. తాజాగా ఈ ప్రమోషన్స్ లో మరోసారి అకిరా హీరో అవ్వడు, అతనికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు అని మరోసారి క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్.
అయితే తల్లిగా మీకు అకిరాని ఎలా చూడాలని ఉంది అని అడిగితే.. అకిరా ఒక పెద్ద స్టేడియంలో కొన్ని వందల మంది ముందు పియానో వాయిస్తుంటే చూడాలని ఉంది. అలాగే ఏ తల్లి అయినా తన కొడుకుని స్క్రీన్ మీద చూడాలి అనుకుంటుంది. కానీ అకిరా ఏం అవ్వాలనుకుంటున్నాడో అది తన ఇష్టం. అకిరా యాక్టర్ అవ్వాలని ఉందని చెప్పినా, ఇంకేదైనా సరే ఓకే చెప్తాను అని తెలిపింది రేణు దేశాయ్.
Also Read : Pooja Hegde : బర్త్‌డే రోజు మాల్దీవ్స్ కి చెక్కేసిన బుట్టబొమ్మ.. సముద్రంలో హాయిగా పడుకొని..
ఇక అకిరా పియానో వాయిసాతాడని అందరికి తెలిసిందే. గతంలో పలు మార్లు అకిరా పియానో వాయించిన వీడియోల్ని రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే అకిరా ఓ షార్ట్ ఫిలింకి సంగీత దర్శకత్వం కూడా వహించాడు. మరి భవిష్యత్తులో అకిరా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడేమో చూడాలి.
