అకిరా అంత లెన్త్ పెరగడానికి అసలు సీక్రెట్ ఇదా.. రేణు దేశాయ్ చెప్పిన సీక్రెట్..
తాజాగా రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అకిరా నందన్ హైట్ గురించి ప్రస్తావన రాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Renu Desai)
- Saketh U
- Updated on- April 24, 2026 / 05:49 PM IST
Renu Desai
Renu Desai : పవన్ కళ్యాణ్ తనయుడుగా అకిరా నందన్ ఇప్పటికే చాలా ఫేమస్. అకిరా ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అప్పుడప్పుడు అకిరా తన తండ్రితో కలిసి కనిపిస్తున్నాడు. అకిరా చాలా హైట్ అని తెలిసిందే. తాజాగా రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అకిరా నందన్ హైట్ గురించి ప్రస్తావన రాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. అకిరా చిన్నప్పట్నుంచి వెజిటేరియన్. తన చిన్నప్పుడు అందరూ అడిగారు నువ్వు నాన్ వెజ్ పెట్టట్లేదు అకిరా ఎలా పెరుగుతాడు అని. అందరూ ఆ విషయంలో నన్ను టెన్షన్ పెట్టారు. కానీ అకిరా ఇప్పుడు 6.4 హైట్ ఉన్నాడు. ఆద్య 5.11 ఉంటుంది. నేను 5.8 ఉన్నాను. పిల్లలు ఇద్దరూ కేవలం ఇంటి తిండి తింటారు. ఫ్రెష్ ఫుడ్ తింటారు.
Also Read : Ram Charan : మలయాళ నటీనటులతో రామ్ చరణ్.. వాలా 2 టీమ్‌తో చరణ్ సందడి.. ఫోటోలు..
మా ఇంట్లో మ్యాగీ వండితే పండగే. ఎప్పుడో నెలకు ఒకసారి. నేను రోడ్డు మీద అమ్మే ఫ్రెష్ కూరగాయలు తీసుకొచ్చి వండుతాను. సూపర్ మర్కెట్స్ లోవి అస్సలు కొనను. నానబెట్టిన విత్తనాలు తింటారు. రోజూ పెసర పప్పు తినిపించాను. కొన్ని ఫుడ్స్ కచ్చితంగా తినిపిస్తాను. అందుకే అంత మంచిగా పెరిగారు. ఫుడ్ బాగుండాలి. పిల్లలు కడుపులో ఉన్నప్పుడు కూడా మహిళలు మంచి ఫుడ్ తీసుకోవాలి. తీసుకుంటే పిల్లలకు బలం వస్తుంది. అశ్వగంధ తినిపిస్తాను. దాని వల్ల బోన్స్ గట్టిగా అవుతాయి అని తెలిపింది.
మొత్తానికి అకిరా నందన్ అంత హైట్ పెరగడానికి మంచి ఫుడ్ కారణమని చెప్తుంది రేణు దేశాయ్. ఇక అకిరా ప్రస్తుతం సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఆల్రెడీ షార్ట్ ఫిలిమ్స్ కి మ్యూజిక్ డైరెక్షన్ చేసాడు. OG సినిమాకు తమన్ టీమ్ లో పని చేసాడు. భవిష్యత్తులో హీరో కాకుండా అకిరా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని తెలుస్తుంది.
