Renu Desai: అనారోగ్యంపై సంచలన ప్రకటన చేసిన రేణూ దేశాయ్.. సోషల్ మీడియాలో వెల్లడించిన నటి
సోషల్ మీడియా వేదికగా సోమవారం తన అనారోగ్యంపై ఒక పోస్ట్ చేశారు. తను గుండె జబ్బుతోపాటు పలు సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రకారం.. ‘‘నేను గుండె సంబంధిత సమస్యలతోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో చాలా ఏళ్లుగా బాధపడుతున్నాను.
- Narender Thiru
- Published On : February 14, 2023 / 05:37 PM IST
Renu Desai: టాలీవుడ్ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తన అనారోగ్యంపై సంచలన విషయం వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా సోమవారం తన అనారోగ్యంపై ఒక పోస్ట్ చేశారు. తను గుండె జబ్బుతోపాటు పలు సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
iPhone14: రెండు ఐఫోన్14 ఫోన్లతో దొరికిపోయిన పైలట్.. ఎయిర్ ఇండియా ఏం చేసిందంటే..
ఈ పోస్ట్ ప్రకారం.. ‘‘నేను గుండె సంబంధిత సమస్యలతోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో చాలా ఏళ్లుగా బాధపడుతున్నాను. ఈ విషయం నా సన్నిహితులకు తెలుసు. వాటిని ఎదుర్కొనేందుకు చాలా కష్టంతో శక్తిని కూడగట్టుకుంటున్నాను. నేను ఈ విషయాన్ని వెల్లడించేందుకు కారణం ఉంది. నాలాగే ఎంతో మంది వాళ్ల సమస్యలతో బాధ పడుతుంటారు. అలాంటివాళ్లందరిలో స్ఫూర్తి నింపేందుకే ఈ పోస్ట్ చేస్తున్నా. మనం దృఢంగా ఉంటూ విశ్వాసాన్ని కోల్పోకూడదు. మీమీద, జీవితం మీద విశ్వాసం కోల్పోకూడదు. మన కోసం ఈ ప్రపంచం అందమైన జీవితాన్ని సిద్ధం చేసే ఉంటుంది’’ అని పోస్ట్ చేసింది.
ప్రస్తుతం తాను మందులు, చికిత్స, పోషకాహారం తీసుకుంటున్నట్లు, యోగా వంటివి కూడా చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. త్వరలోనే కోలుకుని, సాధారణ జీవితాన్ని గడుపుతానని, షూటింగ్‌లో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్నట్లు రేణూ దేశాయ్ చెప్పినప్పటికీ, స్పష్టమైన సమస్యల్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. రేణూ దేశాయ్ ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న ‘రావణాసుర’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. కాగా, ఇటీవలి కాలంలో కొందరు నటీమణులు తాము అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత తాను మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది.
