RGV Comments on Liger Movie : ‘లైగర్’పై ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్.. బాలీవుడ్ వాళ్ళు అందుకే అలా చేశారంటూ..
లైగర్ సినిమా చూసి నెటిజన్లు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులు కూడా కామెంట్స్ చేశారు. తాజాగా లైగర్ సినిమాపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లైగర్ సినిమా గురించి మాట్లాడుతూ..............
- Saketh U
- Published On : September 17, 2022 / 09:29 AM IST
RGV Comments on Liger Movie
RGV Comments on Liger Movie : ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన ‘లైగర్’ సినిమా ఆగస్టు 25న రిలీజయింది. ఇందులో వరల్డ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఓ ముఖ్యపాత్ర చేశారు. సినిమాపై ముందునుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక చిత్ర యూనిట్ కూడా సినిమాపై భారీగా హైప్ చేసింది. ప్రమోషనల్ ఈవెంట్స్ లో హీరో, డైరెక్టర్ ఓ రేంజ్ లో సినిమా గురించి చెప్పారు. అయితే హీరో ప్రమోషనల్ ఈవెంట్స్ లో మాట్లాడిన మాటలకి అప్పుడే నెగిటివిటి ఏర్పడింది. ఇక సినిమా రిలీజ్ అయి అది భారీ పరాజయం చెందడం, మైక్ టైసన్ లాంటి పవర్ ఫుల్ వ్యక్తితో కామెడీ క్యారెక్టర్ చేయించడంతో నెటిజన్లు ఆ సినిమాని, హీరో, డైరెక్టర్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.
లైగర్ సినిమా చూసి నెటిజన్లు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులు కూడా కామెంట్స్ చేశారు. తాజాగా లైగర్ సినిమాపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లైగర్ సినిమా గురించి మాట్లాడుతూ.. ”బాలీవుడ్‌లో బాయ్‌కాట్ లైగర్ అనడానికి మెయిన్ కారణం కరణ్ జోహర్. అతనికి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉండడం వల్ల బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించలేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ ప్రజలు కరణ్ సినిమాలను బాయ్ కాట్ చేయడం మామూలైపోయింది. అయితే ఇదొక్కటే లైగర్ పరాజయానికి కారణం మాత్రం కాదు.”
”మరొక కారణం వినయం. హిందీ ప్రేక్షకులు ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్‌ల మంచితనం, స్టేజిమీద, నలుగురిలో పద్దతిగా, వినయంగా ఉండటం చూసి చాలా ఇష్టపడ్డారు. బాలీవుడ్‌లో అలా ఉండేవాళ్లు చాలా తక్కువ మంది. కానీ విజయ్ మామూలుగానే స్టేజీపై దూకుడుగా ఉంటాడు. అందరినీ ఆకర్షించాలని రకరకాల చేష్టలు చేస్తాడు, లైగర్ ఈవెంట్‌లలో, ప్రమోషన్స్ లో విజయ్ మరీ ఓవర్ గా మాట్లాడటం కూడా ఈ సినిమాకి మైనస్ అయింది” అని అన్నారు. ఇన్ని రోజులు ప్రేక్షకులు కూడా ఇదే భావించడం, ఇప్పుడు ఆర్జీవీ కూడా ఇదే చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
