Aa Ammyi Gurinchi Meeku Cheppali : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రివ్యూ.. ట్విస్టులు, ఎమోషనల్ డ్రామా, అదరగొట్టిన కృతిశెట్టి..

సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. సెప్టెంబర్ 16న రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంటుంది. సుధీర్ బాబు, కృతిశెట్టి, ఇంద్రగంటి ముగ్గురికి కూడా.............

Aa Ammyi Gurinchi Meeku Cheppali : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రివ్యూ.. ట్విస్టులు, ఎమోషనల్ డ్రామా, అదరగొట్టిన కృతిశెట్టి..

aa ammayi gurinchi meeku cheppali review

Aa Ammyi Gurinchi Meeku Cheppali : సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సెప్టెంబర్ 16న రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంటుంది. సుధీర్ బాబు, కృతిశెట్టి, ఇంద్రగంటి ముగ్గురికి కూడా తమ గత సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇంద్రగంటి సినిమాలకి ఒక క్లాసిక్ మార్క్ ఉంటుంది. ఈ సినిమాతో మళ్ళీ ఆ క్లాసిక్ మార్క్ చూపించారు. ట్రైలర్ తోటే సినిమాపై అంచనాలు పెంచారు. మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అక్కడక్కడా కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించినా ఓవరాల్ గా సినిమా బాగుంది అంటున్నారు ప్రేక్షకులు.

కథ విషయానికొస్తే.. సుధీర్ బాబు ఒక సక్సెస్ కమర్షియల్ డైరెక్టర్. తన నెక్స్ట్ సినిమా కోసం కొత్త హీరోయిన్ వెతుకుతుంటే తనకి ఒక రీల్ దొరికి అందులో కృతిశెట్టి పర్ఫార్మెన్స్ చూసి ఆ మ్మాయిని ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. తీరా ఆ అమ్మాయి దొరికితే తనకి, తన ఇంట్లో వాళ్ళకి సినిమాలంటేనే అసహ్యం. దీంతో తనకి దగ్గరవ్వాలని చేసే ప్రయత్నాలు, వెన్నెల కిషోర్ కామెడీ, హీరోయిన్ ఫ్యామిలీకి సినిమాలంటే అసహ్యం అన్న పాయింట్ లో ఫస్ట్ హాఫ్ ని యావరేజ్ గా నడిపించేసాడు. ఇంటర్వెల్ కి ఎవరూ ఊహించని ఓ ఎమోషనల్ ట్విస్ట్ ని ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు డైరెక్టర్.

Sudheer Babu : అందుకే బ్రహ్మాస్త్ర సినిమా వదులుకున్నాను..

ఇక సెకండ్ హాఫ్ లో కృతిశెట్టి తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం, సినిమా ఒప్పుకోవడం, అది కృతి ఇంట్లో వాళ్లకి తెలిసి సినిమా ఆగిపోవడం, మళ్ళీ కొన్ని సంఘటనలు జరగడంతో సినిమా పూర్తవడం, మధ్యలో అవసరాల శ్రీనివాస్ ని తీసుకొచ్చి ఇచ్చిన ట్విస్ట్ హైలెట్ గా నిలవడం, వెన్నెల కిషోర్ కామెడీ… ఇలా సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. సినిమాకి సెకండ్ హాఫ్ చాలా ప్లస్ అవుతుంది. సినిమా లాస్ట్ గంట మాత్రం ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అవుతారు.

సుధీర్ బాబు, కృతి శెట్టి చాలా బాగా నటించారు. ముఖ్యంగా కృతి తండ్రిగా శ్రీకాంత్ ఆచార్య అద్భుతంగా చేశారు. సినిమాల్లో వచ్చే రెండు, మూడు ట్విస్టులు ఎవరూ ఊహించని విధంగా ఉండటంతో చాలా బాగా హెల్ప్ అయ్యాయి. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకి ప్లస్ అయింది. ఇక సినిమా వాళ్ల జీవితాల గురించి కూడా చూపించాడు డైరెక్టర్. ఆ సన్నివేశాలు సినిమావాళ్ళకి బాగా కనెక్ట్ అవుతాయి. ఎమోషనల్ గా మంచి డ్రామాని నడిపించాడు. కృతి ఇది ఉప్పెన కంటే ముందే ఒప్పుకొని, ఉప్పెన సమయంలోనే ఈ షూట్ కూడా జరగడంతో కొన్ని సన్నివేశాల్లో చిన్నపిల్లలాగా కనిపిస్తుంది. సినిమాలో ఇంద్రగంటి సినిమా మార్క్ కనిపిస్తుంది. కాకపోతే మొదటి సారి ఇంద్రగంటి ఐటెం సాంగ్ ని పెట్టారు సినిమాలో అయితే అది కూడా కథకి, సన్నివేశాలకి తగ్గట్టు ఉండటంతో నెగిటివ్ అనిపించదు. సినిమా లవర్స్ ఈ సినిమాని కచ్చితంగా చూడాలి.