Krishnam Raju : ఇంత గొప్ప మనిషి చనిపోతే ఒక్కరోజు కూడా షూటింగ్స్ ఆపరా..? సినీ పరిశ్రమపై ఆర్జీవీ ఫైర్..
ఆర్జీవీ తన ట్వీట్స్ లో.. ''భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహానటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత..........
- Saketh U
- Updated on- September 12, 2022 / 10:40 AM IST
RGV Fires on Tollywood regarding Krishnam Raju
Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణం టాలీవుడ్ కి తీరని లోటు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులంతా కృష్ణంరాజుకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆర్జీవీ సంచలన ట్వీట్స్ చేశారు. సాధారణంగా ఏదైనా పరిశ్రమలో గొప్ప మనిషి చనిపోతే వారికి నివాళులర్పిస్తూ ఒకరోజు వారి పనులని ఆపేస్తారు. అలాగే సినీ పరిశ్రమలో గొప్పవారెవరైనా చనిపోతే వారికి నివాళులుగా షూటింగ్స్ ఒక రోజు ఆపుతారు.
తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించడంతో సినీ ప్రముఖులంతా వచ్చి ఆయనకి నివాళులు అర్పించారు. కానీ షూటింగ్స్ ని ఆపలేదు. ఇటీవల సినీ పరిశ్రమ సమస్యల్లో ఉందంటూ దాదాపు 20 రోజులకు పైగా షూటింగ్స్ ఆపేసి, ఇప్పుడేమో ఆయనకి నివాళిగా ఒక్కరోజు కూడా షూటింగ్ ఆపకపోవడంతో తెలుగు సినీ నిర్మాతలపై వ్యతిరేకత వస్తుంది. తాజాగా దీనిపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్ చేశారు.
ఆర్జీవీ తన ట్వీట్స్ లో.. ”భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహానటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!. కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి, మోహనబాబుగారికి, బాలయ్యకి, ప్రభాస్ కి, మహేష్, కల్యాణ్ కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది. మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది.” అంటూ సినీ పరిశ్రమపై ఫైర్ అయ్యారు.
దీంతో ఆర్జీవీ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి. ఈ విషయంలో అభిమానులు, ప్రేక్షకులు ఆర్జీవికి మద్దతుగా నిలుస్తున్నారు. మరి ఇప్పటికైనా తెలుగు సినీ నిర్మాతలు తమ తప్పు తెలుసుకొని కృష్ణంరాజుకి సంతాపం ప్రకటిస్తూ ఒక్క రోజైనా షూటింగ్స్ ఆపుతారేమో చూడాలి.
