Krishnam Raju with Tiger : కృష్ణంరాజుకి ఒక పులి ఫ్యాన్ అని మీకు తెలుసా..? రియల్ పులితో ఫైట్ చేసి మచ్చిక చేసుకున్న రెబల్ స్టార్..

గతంలో కృష్ణంరాజు, ఆయన భార్య కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయనకి పులులతో ఉన్న సంబంధం గురించి చెప్పారు. కృష్ణంరాజు మాట్లాడుతూ.. ''ఓ సారి నేను వేటకి వెళ్ళినప్పుడు పులి నా మీద అటాక్ చేసింది.............

Krishnam Raju with Tiger : కృష్ణంరాజుకి ఒక పులి ఫ్యాన్ అని మీకు తెలుసా..? రియల్ పులితో ఫైట్ చేసి మచ్చిక చేసుకున్న రెబల్ స్టార్..

Krishnam raju friendly with a tiger

Updated On : September 12, 2022 / 8:18 AM IST

Krishnam Raju with Tiger :  రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం టాలీవుడ్ కి తీరని లోటుని ఏర్పరిచింది. ఆయనకి సంబంధించిన పలు సంఘటనలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కృష్ణం రాజుది మొదట్నుంచి రాజుల ఫ్యామిలీ. గతంలో కృష్ణంరాజు వేటకి కూడా వెళ్లేవారు. అడవుల్లో తిరిగేవారు. ఓ సారి వేటకి వెళ్ళినపుడు కృష్ణంరాజు ఓ పులి నుంచి తప్పించుకొని బయటపడ్డారు.

గతంలో కృష్ణంరాజు, ఆయన భార్య కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయనకి పులులతో ఉన్న సంబంధం గురించి చెప్పారు. కృష్ణంరాజు మాట్లాడుతూ.. ”ఓ సారి నేను వేటకి వెళ్ళినప్పుడు పులి నా మీద అటాక్ చేసింది. నా వెనకాల నుంచి ఒక్క పరుగుతో ముందుకు వెళ్లింది. తప్పించుకున్నాను. నాకు తెలిసి పులి మహా పిరికిది. పులిని ఎవరైనా అటాక్ చేస్తారనుకుంటేనే అది కూడా అటాక్ చేస్తుంది. లేకపోతే చేయదు” అని చెప్పారు. అప్పుడు కృష్ణంరాజు భార్య ఓ పులి మీకు ఫ్యాన్ కదా అని చెప్పడంతో దానికి సంబంధించిన స్టోరీ చెప్పారు కృష్ణంరాజు.

Kriahnam Raju : నేడు మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు.. అధికారలాంఛనాలతో..

”ఒక పులిని ‘కటకటాల రుద్రయ్య’ సినిమా కోసం తీసుకొచ్చారు. అందులో పులితో పోరాడే ఫైట్ సీన్ ఉంది. ఫైట్ కోసం పులిని తీసుకొచ్చారు. ఫస్ట్ టైం దాని మెడ పట్టుకుంటే విసిరి కొట్టింది. ఎగిరి పడ్డాను. అయితే నేను దాని మెడ దగ్గర నిమురుతూ మచ్చిక చేసుకున్నాను. మచ్చిక చేసుకున్న తర్వాత ఫ్రెండ్లీ అయింది. ఆ తర్వాత అదే పులిని ఏడాది తర్వాత ఇంకో సినిమా కోసం తీసుకొస్తే నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చింది” అని తెలిపారు.