Kantara 2 : కాంతార 2 బిగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ డేట్ అనౌన్స్..

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాంతార 2 ఫస్ట్ లుక్ గురించిన అప్డేట్ ని మేకర్స్ తెలియజేశారు.

Rishab Shetty Kantara 2 Movie first look glimpse update

Kantara 2 : ‘కేజీఎఫ్’ చిత్రం తరువాత కన్నడ సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా ఒక సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చి ఇండియా వైడ్ భారీ విజయాన్ని చేసుకున్న చిత్రం ‘కాంతార’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో సప్తమి గౌడ్ హీరోయిన్ గా నటించారు. కేవలం 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ చిత్రం ఇంతటి బ్లాక్ బస్టర్ అవ్వడంతో సెకండ్ పార్ట్ ని కూడా తీసుకు రావాలని మేకర్స్ భావించారు.

అయితే సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ని సిద్ధం చేస్తున్నారు. కాంతార సినిమా హీరో తండ్రి పాత్ర ముగియడంతో మొదలవుతుంది. ఇప్పుడు ఆ తండ్రి పాత్రని మొదలుగా తీసుకోని కాంతార 2ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ కొన్ని వందల ఏళ్ళ క్రితం జరిగిన పంజుర్లి దైవ కథతో పీరియాడిక్ సినిమాగా ఉండబోతుందని సమాచారం. కాంతార 2 కోసం చాలా రీసర్చ్ చేసిన రిషబ్ శెట్టి.. ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టి చిత్రీకరణ జరుపుతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ గురించిన అప్డేట్ ని మేకర్స్ తెలియజేశారు.

Also read : Ileana D’Cruz : ఎట్టకేలకు తన భర్తని చూపించిన ఇలియానా.. అతడేనట..

ఈ నెల 27న మధ్యాహ్నం గం.12:25 నిమిషాలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. గ్లింప్స్ రూపంలో ఈ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ గ్లింప్స్ తో ఆడియన్స్ ని కాంతార ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్నారట. హోంబేలె ఫిలిమ్స్ ఈ సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మిస్తుంది. అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఇంకే స్టార్ కాస్ట్ కనిపించబోతుందో తెలియాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు