Rithu Chowdary : హార్ట్ బ్రేక్ చేసి ఆ అబ్బాయి ఇంకో అమ్మాయితో వెళ్ళిపోయాడు.. రీతూ చౌదరి సంచలన పోస్ట్..
తాజాగా రీతూ చౌదరి తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. (Rithu Chowdary)
- Saketh U
- Published On : March 16, 2026 / 09:26 PM IST
Rithu Chowdary
Rithu Chowdary : సీరియల్స్, బిగ్ బాస్ తో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది రీతూ చౌదరి. ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా ఉంది. గతంలో ఓ రెండేళ్ల క్రితం రీతూ చౌదరి శ్రీకాంత్ అనే ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్టు, పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా అధికారికంగానే ప్రకటించింది. కానీ ఏమైందో ఏమో వారిద్దరూ విడిపోయారు. విడిపోయిన విషయం కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది రీతూ చౌదరి.
బిగ్ బాస్ తర్వాత డిమాన్ పవన్ తో డేటింగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ దానిపై రీతూ స్పందించలేదు. కానీ ఇద్దరూ కలిసి క్లోజ్ గానే తిరుగుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా రీతూ చౌదరి తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
Also Read : Sukumar Daughter : ఇంటర్నేషనల్ స్టేజిపై సుకుమార్ కూతురు సింగర్ గా అదరగొట్టిందిగా.. సుకృతి వీడియో వైరల్..
Rithu Chowdary
రీతూ చౌదరి తన స్టోరీలో.. ఈ సమాజం అమ్మాయిలను ఈజీగా జడ్జ్ చేస్తారు. కానీ ఆమె గతంలో ఏం జరిగిందో ఎవరూ అడగరు. తను నిజంగానే ప్రేమించింది, కేర్ తీసుకుంది, నిజాయితీగా ఉంది. కానీ తనే బాధపడింది. ప్రేమ కోసం అడుక్కుంది. కానీ చివరకు మోసపోయింది. రిలేషన్ షిప్ బ్రేక్ అవడంతో డిప్రెషన్ కి వెళ్ళింది. తన ఫేస్ మీద స్మైల్ తో ఫ్యామిలీ కోసం, కెరీర్ కోసం నడుస్తుంది. కానీ సమాజం తన బాధని చూడదు. అందరూ రూమర్స్, ఆరోపణలు, నిజం కాని కథలే చూస్తారు. నిజం ఏంటో తెలియకుండా అమ్మాయిని జడ్జ్ చేస్తారు. ఒకవేళ తను అమాయకురాలు అయితే ఎందుకు సైలెంట్ గా ఉంది అని అంటారు. కానీ ఫైట్ చేయడానికి మాటలు అలిసిపోయినప్పుడు నిశబ్దం మాత్రమే బలం అవుతుంది.
హార్ట్ బ్రేకప్ చేసి ఆ అబ్బాయి మూవ్ ఆన్ అయిపోయాడు. పైగా ఒకప్పుడు ఫ్రెండ్ అని పిలిచిన అమ్మాయితో వెళ్ళిపోయాడు. అన్ని చూస్తున్నా, అన్ని తెలిసినా సైలెంట్ గానే ఉంది ఈ అమ్మాయి. స్నేహం కూడా ఆయధంగా మారింది. ఒక అమ్మాయి డబ్బు కోసం, చీప్ అటెన్షన్ కోసం ఇంకో అమ్మాయిపై ఆరోపణలు చేసింది, సమాజం ముందు బ్యాడ్ చేసింది. తను అంతలా ఆలోచించలేదు ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని ఇలా నాశనం చేస్తుంది అని అయినా ఆ అమ్మాయి సైలెంట్ గానే ఉంది. అలా అని తను బలహీనంగా ఉంది అని కాదు తను కర్మని, దేవుడ్ని నమ్ముతుంది. అందుకే సమాజం తనను జడ్జ్ చేస్తున్న సైలెంట్ గా బాధని భరిస్తుంది అంటూ పోస్ట్ చేసింది.
అయితే రీతూ చెప్పింది అంతా తన గురించేనా? ఆ అబ్బాయి ఎవరు? శ్రీకాంతేనా? తనని నెగిటివ్ చేసిన అమ్మాయి ఎవరు? అసలు ఇది రీతూ చౌదరి కథేనా లేక ఇంకెవరిదైనానా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీతూ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఇలాంటి ఎమోషనల్ స్టోరీ పోస్ట్ చేయడంతో ఈ బ్రేకప్ స్టోరీ ఏ అమ్మాయిది అని చర్చగా మారింది.
