Ritika Nayak : నేను దయ్యాలను నమ్ముతాను.. ఆ రోజు.. మిరాయ్ భామ రితిక కామెంట్స్ వైరల్..

నేడు హీరోయిన్ రితిక నాయక్ మీడియాతో మాట్లడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. (Ritika Nayak)

  • Updated on- July 27, 2026 / 02:39 PM IST

Ritika Nayak

Ritika Nayak : అశోకవనంలో అర్జున కళ్యాణం, హాయ్ నాన్న, మిరాయ్.. సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన హీరోయిన్ రితిక నాయక్. ఇప్పుడు వరుణ్ తేజ్ సరసన కొరియన్ కనకరాజు సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ఆగస్టు 7న రిలీజ్ అవుతుండగా మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. నేడు హీరోయిన్ రితిక నాయక్ మీడియాతో మాట్లడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

కొరియన్ కనకరాజు సినిమాలో హారర్ ఎలిమెంట్స్, ఘోస్ట్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో దయ్యాల గురించి రియల్ లైఫ్ లో మీ అభిప్రాయం ఏంటి అని రితికని అడిగారు.

Also Read : Aadarsha Kutumbam : ఆద‌ర్శ‌కుటుంబం.. చిట్టిబాబుగా వెంక‌టేష్.. న‌వ్వులు పూయిస్తున్న వీడియో..

రితిక నాయక్ దీనిపై స్పందిస్తూ.. నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను అంటే దేవుడి దయవల్లే. నాకు వచ్చే సక్సెస్, సినిమాలు దేవుడి వల్లే. నేను దయ్యాలు కూడా నమ్ముతాను. చిన్నప్పుడు ఒక రోజు స్కూల్ లో నేను, మా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి స్కూల్ వెనక్కి వెళ్లి ఓజా బోర్డు స్పిరిట్ గేమ్ ఆడాము. ఆ గేమ్ ఆడిన తర్వాత నేను మెట్ల మీద నుంచి జారి పడ్డాను. మా ఫ్రెండ్ అందరికి కూడా ఏదో ఒకటి జరిగింది. అప్పుడు భయం వేసింది. అప్పటి నుంచి ఇది కూడా నమ్ముతాను అని తెలిపింది.