Roja: బుల్లితెరపైకి రోజా గ్రాండ్ రీ-ఎంట్రీ.. ‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’తో సరికొత్త హంగామా!
Rk Roja The Family Assembly Show Promo: సుదీర్ఘ విరామం తరువాత ది ఫ్యామిలీ అసెంబ్లీ షోతో ఆడియన్స్ ముందుకు వస్తున్న రోజా(Roja).
- V Santhosh Kumar
- Updated on- April 17, 2026 / 12:28 PM IST
Roja The Family Assembly Show on Zee Telugu
- బుల్లితెరపై రోజా రీ ఎట్రీ
- ‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ షోతో సరికొత్తగా
- త్వరలోనే ప్రసారం కానున్న షో
Roja: ఒకప్పుడు హీరోయిన్ గా, ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు రోజా. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్లీ బుల్లితెరపైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గతంలో రియాలిటీ షోల ద్వారా విశేషమైన పాపులారిటీ సంపాదించుకున్న రోజా, ఇప్పుడు జీ తెలుగు వేదికగా ప్రారంభం కానున్న ‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ అనే వినూత్న షోతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మేరకు విడుదలైన లేటెస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో రోజా(Roja) ఒక పవర్‌ఫుల్ సింహాసనంపై కూర్చుని రాజసంగా ఆకట్టుకుంటున్నారు.
*త్రిష ఎందుకు అన్నారు.. వాళ్లందరికీ ఒకే సమాధానం
ఈ షో పూర్తిగా వినోదాత్మకమైన రియాలిటీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. “అన్‌లిమిటెడ్ ఫన్, అన్‌ఫిల్టర్డ్ రోజా” అనే ట్యాగ్‌లైన్ చూస్తుంటే, ఇందులో రోజా మళ్లీ తన మార్క్ పంచులు, చమత్కారాలతో సందడి చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ వాతావరణాన్ని గుర్తుచేస్తూ ‘అధ్యక్షా..’ అంటూ సాగే ఆమె హంగామా షోకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కేవలం వినోదం మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే విధంగా ఈ ఫన్-ఫిల్డ్ గేమ్ షోను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
ఏప్రిల్ 19, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగు ఛానల్‌తో పాటు జీ5 (ZEE5) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ కార్యక్రమం గ్రాండ్‌గా లాంచ్ కానుంది. రోజా రీ-ఎంట్రీ వార్తతో బుల్లితెర అభిమానుల్లో మళ్లీ పాత జోష్ కనిపిస్తోంది. గ్లామర్, గ్రేస్, అదిరిపోయే టైమింగ్‌తో రోజా ఈ సరికొత్త ఇన్నింగ్స్‌ను ఎలా రక్తి కట్టిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
