Roshan Meka: ఈమాత్రం స్పీడ్ ఉంటే చాలు.. స్టార్ హీరో అయిపోవచ్చు
క్రేజీ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేస్తున్న యంగ్ హీరో రోషన్(Roshan Meka.)
- V Santhosh Kumar
- Published On : February 25, 2026 / 06:34 AM IST
Roshan Meka doing his next movie with director indraganti mohan krishnaRoshan Meka doing his next movie with director indraganti mohan krishna
Roshan Meka: ఛాంపియన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో రోషన్. వైజయంతి బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి విజయాన్ని సాధించింది. సినిమాలో రోషన్ నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి. అయితే, మొదటి సినిమా పెళ్లిసందD ఛాంపియన్ సినిమాకు ఏకంగా నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్నాడు రోషన్. కానీ, తన నెక్స్ట్ సినిమాల విషయంలో మాత్రం లేట్ చేయడం లేదు. ఇటీవలే రోషన్ హీరోగా కొత్త సినిమా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే.
అదే ‘ఏమో ఏమో ఇది’. హిట్ సిరీస్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ రోమ్-కామ్ లో కన్నప్ప మూవీ బ్యూటీ ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Mahesh- Rajamouli: పొట్టు పొట్టు కొట్టుకున్న మహేష్, రాజమౌళి.. ఎంత పనిచేశావ్ వర్మ
ఇక ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరో సినిమాకి గ్రీస్ సిగ్నల్ ఇచ్చాడు రోషన్(Roshan Meka). ఇటీవల దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ రోషన్ కి లవ్ అండ్ ఎమోషనల్ కథను వినిపించాడట. చాలా కొత్త పాయింట్ తో ఉన్న ఆ కథ రోషన్ కి చాలా బాగా నచ్చిందట. అందుకే వెంటనే ఒకే చెప్పేశాడట. నిజానికి, ఈ కథను మరో స్టార్ హీరో కోసం రాసుకున్నాడట దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. కానీ, ఛాంపియన్ సినిమా చూశాక ఆ కథకు రోషన్ అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడట.
ఇక ఈ కథను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు అని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉంది. ఇక వెంట వెంటనే సినిమాలను ఒకే చేస్తూ జెట్ స్పీడ్ లో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. మిగతా హీరోలలా కాకుండా ఇయర్ కి రెండు సినిమాలను పక్కాగా దించాలను చూస్తున్నాడట. అయితే, ఇదే స్పీడ్ మైంటైన్ చేస్తే మాత్రం తప్పకుండా స్టార్ హీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
