Emo Emo Idi : హిట్ డైరెక్టర్ తో శ్రీకాంత్ కొడుకు క్లాస్ సినిమా.. ‘ఏమో ఏమో ఇది’ రిలీజ్ డేట్ అనౌన్స్..

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ తో ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అవుతుందని తెలుస్తుంది. (Emo Emo Idi)

  • Published on- September 21, 2026 / 04:38 PM IST

Emo Emo Idi

Emo Emo Idi : హిట్ ఫ్రాంచైజీతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు దర్శకుడు. వరుసగా మూడు సినిమాలు హిట్ ఫ్రాంచైజ్ చేసి హిట్ 4 కంటే ముందు ఒక లవ్ స్టోరీ సినిమా తీస్తున్నాడు. రోషన్ మేక, ప్రీతి ముకుందన్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ఏమో ఏమో ఇది సినిమా తెరకెక్కుతుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో ఈ సినిమా రానుంది.

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఏమో ఏమో ఇది సినిమా రిలీజ్ డేట్ ని తాజాగా ప్రకటించారు. ఈ సినిమా 2026 అక్టోబర్ 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ తో ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అవుతుందని తెలుస్తుంది.

Also Read : Bigg Boss Today Promo : కొట్టుకోడానికి రెడీ అయిన సుధీర్ – త్రిగున్.. నామినేషన్స్ ఫైర్.. బిగ్ బాస్ ప్రోమో వైరల్..