Bigg Boss Today Promo : కొట్టుకోడానికి రెడీ అయిన సుధీర్ – త్రిగున్.. నామినేషన్స్ ఫైర్.. బిగ్ బాస్ ప్రోమో వైరల్..
మీరు కూడా బిగ్ బాస్ తాజా ప్రోమో చూసేయండి.. (Bigg Boss Today Promo)
Bigg Boss 10 Promo
Bigg Boss Today Promo : వీకెండ్ ఎపిసోడ్ అయ్యాక నేడు సోమవారం నామినేషన్స్ ఫైర్ తో ఉండనుంది బిగ్ బాస్. ఇవాళ ఉదయం రిలీజ్ చేసిన ప్రోమోలో సృష్టి – సుధీర్ మధ్య ఫైట్ జరగ్గా తాజాగా మరో ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో వర్షిణి – షాలిని మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. షాలిని గత వారం కెప్టెన్సీ టాస్క్ సమయంలో వర్షిణిపై గొడవకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందుకు నాగార్జున కూడా వీకెండ్ లో తిట్టారు. దీంతో వర్షిణి షాలినిని నామినేట్ చేస్తే షాలిని ఫైర్ అయిందని తెలుస్తుంది.
అలాగే ఫుడ్ విషయంలో వంశీ – వర్షిణి గొడవ పడ్డారు. ఇక సుధీర్ – త్రిగున్ కూడా నామినేషన్స్ లో గొడవ పడ్డారు. మధ్యలో సృష్టి విషయం వచ్చింది. దీంతో త్రిగున్ – సుధీర్ ఒకరిపై ఒకరు కొట్టుకోడానికి వెళ్లిపోయారు. దీంతో హౌస్ లో ఉన్న సభ్యులు వెళ్ళాను ఆపడానికి ప్రయత్నిచారు. ఈ ప్రోమోలు చూస్తుంటే నేడు నామినేషన్స్ ఎపిసోడ్ ఫుల్ ఫైర్ తో కొనసాగనుందని తెలుస్తుంది.
మీరు కూడా బిగ్ బాస్ తాజా ప్రోమో చూసేయండి..
