RRR : IGN బెస్ట్ మూవీస్ నామినేషన్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’..
తన విజన్‌తో, తన మేకింగ్‌తో ఇండియా సినిమా రేంజ్ ని అమాంతం పెంచేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ప్రపంచ సినీ సాంకేతిక నిపుణులు భారతీయ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడమే కాకుండా, ప్రపంచ ప్రఖ్యాత అవార్డుల వేడుకల్లో వరుస అవార్డులను అందుకుంటూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టాడు, తెచ్చిపెడుతున్నాడు మన జక్కన్న. తాజాగా...
- gum 95921
- Published on- December 7, 2022 / 10:19 AM IST
RRR in IGN Best Movies Nominations
RRR : తన విజన్‌తో, తన మేకింగ్‌తో ఇండియా సినిమా రేంజ్ ని అమాంతం పెంచేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ప్రపంచ సినీ సాంకేతిక నిపుణులు భారతీయ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడమే కాకుండా, ప్రపంచ ప్రఖ్యాత అవార్డుల వేడుకల్లో వరుస అవార్డులను అందుకుంటూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టాడు, తెచ్చిపెడుతున్నాడు మన జక్కన్న.
RRR: ‘ఆర్ఆర్ఆర్’కు ప్రెస్టీజియస్ HCA స్పాట్లైట్ విన్నర్ అవార్డ్
తాజాగా ప్రముఖ అమెరికన్ వీడియో గేమ్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీడియా అయిన ‘IGN’ అవార్డ్స్ లో చోటు దక్కించుకుంది రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’. 2022 IGN బెస్ట్ మూవీస్ నామినేషన్స్‌లో RRR స్థానం దక్కించుకుంది. కాగా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్న RRR.. ఆస్కార్ తన అంతిమ లక్ష్యంగా దూసుకుపోతుంది.
ఇక ఇప్పటి వరకు ఈ సినిమా అందుకున్న అవార్డులు చూస్తే.. HCA స్పాట్లైట్ అవార్డ్, సన్ సెట్ సర్కిల్ అవార్డ్, అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్, సాటర్న్ అవార్డ్. మరి మునుముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
