RRR Movie : ‘నాటు నాటు’ సాంగ్‌కి నడిరోడ్డుపై ఊరమాస్ డ్యాన్స్!
RRR ‘నాటు నాటు’ పాటకు రోడ్డు మీద డ్యాన్స్ అదరగొట్టిన కుర్రాడు.. వీడియో వైరల్..
- sekhar
- Published On : November 15, 2021 / 04:00 PM IST
Rrr Mass Anthem
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ మాస్ ఆంథమ్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా ఈ పాటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ‘నాటు నాటు’ సాంగ్‌తో రచ్చ లేపారు. ఈ ఇద్దరు హీరోలూ బెస్ట్ డ్యాన్సర్స్ అనే సంగతి తెలిసిందే. అలాంటి వీరిద్దరూ కలిసి స్టెప్పులేస్తే ఇక చెప్పేదేముంటుంది.. చెప్పండి..
Gangubai Kathiawadi : RRR ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన ‘గంగూబాయి’.. రాజమౌళి థ్యాంక్స్..
సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు.. పిల్లల నుండి పండు ముసలి వరకు అందరూ ఈ పాటకు కాలు కదుపుతున్నారు. రీసెంట్‌గా ఓ కుర్రాడు చేసిన ఊరమాస్ డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. అందరిలా పాటకు స్టెప్పులేస్తే వెరైటీ ఏముంటుంది అనుకున్నాడేమో కానీ కాస్త డిఫరెంట్‌గా థింక్ చేసి సోషల్ మీడియాలో టాపిక్ అయ్యాడు.
Divyavani : ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి స్టెప్స్ ఇరగదీసిన సీనియర్ నటి దివ్యవాణి..
రోడ్ మీద ట్రాఫిక్ సిగ్నల్ పడగానే బైక్ ఆగుతుంది. వెంటనే హెల్మెట్ పెట్టుకున్న కుర్రాడు రోడ్ మధ్యలోకి వచ్చి ‘నాటు నాటు’ పాటకు అదిరిపోయే డ్యాన్స్ వెయ్యడంతో అంతా షాక్ అయ్యి చూస్తుండి పోయారు. పాట పాపులారిటీతో పాటు రోడ్ సేఫ్టీ గురించి కూడా చక్కగా చెప్పాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. RRR మూవీ టీం ఈ వీడియోను ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది.
Maaaasss ??? #RRRMassAnthem #RRRMovie https://t.co/m46OnGPtAN
— RRR Movie (@RRRMovie) November 14, 2021
