RRR : జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ లతో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా RRR. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది ఈ సినిమా. దాదాపు 1200 కోట్లకు పైగా కలెక్టు చేసి 50 రోజుల వేడుకల్ని కూడా జరుపుకుంది RRR.
సినిమా రిలీజ్ అయి రెండు నెలల పైనే అవుతున్నా ఇంకా ఈ సినిమా క్రేజ్ తగ్గలేదు. ఇటీవల నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రపంచమంతటా RRR సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వగా ప్రపంచం నలుమూలల నుంచి ఈ సినిమాపై ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ దేశాల్లోని సినీ ప్రముఖులు ఈ సినిమాని అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. వేరే దేశాల్లో ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు కూడా RRR అదుర్స్ అంటూ ట్వీట్స్ వేస్తున్నారు.
Nani : అపరిచితుడిలా వేరియేషన్స్ చూపిస్తున్న నాని..
ఇప్పటికే పలు రికార్డులు సాధించిన RRR తాజాగా మరో రికార్డు సాధించింది. తాజా సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ప్రపంచవ్యాప్తంగా 57 దేశాలలో ట్రెండింగ్లో కొనసాగుతోంది. దీనిని బట్టి చూస్తుంటే ఆర్ఆర్ఆర్ హవా ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్లో ఉందో అర్ధమవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 57 దేశాల్లో ట్రెండింగ్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఈ రికార్డ్ సాధించలేదు. దీంతో RRR చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
RRR is UNSTOPPABLE. LITERALLY!! #RRRMovie https://t.co/jRyDP7yUU5
— RRR Movie (@RRRMovie) June 2, 2022