Nani : అపరిచితుడిలా వేరియేషన్స్ చూపిస్తున్న నాని..

 తెలుగువారికి తన న్యాచురల్ యాక్టింగ్ తో బాగా దగ్గరైన హీరో నాని. ఆల్రెడీ తన యాక్టింగ్ ఏంటో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు నాని. పక్కింటి అబ్బాయిలా సహజమైన..............

Nani : అపరిచితుడిలా వేరియేషన్స్ చూపిస్తున్న నాని..

Nani (1)

Nani :  తెలుగువారికి తన న్యాచురల్ యాక్టింగ్ తో బాగా దగ్గరైన హీరో నాని. ఆల్రెడీ తన యాక్టింగ్ ఏంటో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు నాని. పక్కింటి అబ్బాయిలా సహజమైన యాక్టింగ్ తో అందర్నీ మెప్పించాడు. కానీ ఇటీవల గత కొన్ని సినిమాల నుంచి రాబోయే సినిమాల వరకు ఒక్కో సినిమాకి ఒక్కో వేరియేషన్ చూపిస్తున్నాను నాని. నాని ఈ రేంజ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లు చూసి అంతా ఆశ్చర్యపోతూ అపరిచితుడిలా వేరియేషన్స్ చూపిస్తున్నాడు అని అంటున్నారు.

నాని 25వ సినిమా ‘వి’లో విలన్ షేడ్స్ చూపించి తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఇక టక్ జగదీశ్ సినిమాలో ఫ్యామిలీ కోసం ఆలోచించే ఓ మెచూర్డ్ క్యారెక్టర్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఒక బరువైన పాత్ర చేసి, మరో వైపు క్యాజువల్ గా ఉండే సినిమా డైరెక్టర్ పాత్ర చేసి అందర్నీ మెప్పించి హిట్ కొట్టాడు. ఇప్పుడు త్వరలో అంటే సుందరానికి అనే సినిమాతో ఫుల్ కామెడీ సబ్జెక్టుతో రాబోతున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన కెరీర్ ఆరంభంలో నవ్వించినట్లు నవ్వించబోతున్నాడు. ఇక ఇటీవలే నాని నెక్స్ట్ సినిమా దసరా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఫుల్ మాస్, తెలంగాణ, పక్కా లోకల్ అన్నట్టు ఉండే క్యారెక్టర్ తో రానున్నాడు నాని.

Chiranjeevi : ఆచార్య ఎఫెక్ట్‌తో చిరు నెక్స్ట్ సినిమాల్లో మార్పులు??

ఇలా సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ అపరిచితుడు అనిపించుకుంటున్నాడు నాని. ఒక క్యారెక్టర్ తో మరో క్యారెక్టర్ కి అస్సలు సంబంధం లేకుండా సెట్ చేసుకుంటున్న నాని తన యాక్టింగ్ స్కిల్స్ తో రఫ్ఫాడిస్తున్నాడు. ఇది నాని సరికొత్త యాక్టింగ్ వెర్షన్. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ, క్యారెక్టర్ వేరియేషన్స్ చూపించడం నాని ఫస్ట్ నుంచి చేస్తున్నదే. కానీ ఇప్పుడది పీక్స్ కు రీచ్ అయింది. రొటీన్ రోల్స్ కు బైబై చెప్పేసి తనలోని అపరిచితుడిని బయటికి తెచ్చి అందర్నీ అలరిస్తున్నాడు నాని.