×
Ad

DVV Danayya : నాకు, RRR యూనిట్ కి సంబంధం లేదు.. నిర్మాత దానయ్య సంచలన వ్యాఖ్యలు..

అయితే RRR సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా సినిమా నిర్మాత దానయ్య కనపడలేదు. ఈ విషయం పలుమార్లు చర్చలకు వచ్చినా ఎవరూ స్పందించలేదు. ఆస్కార్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో..................

  • Published On : March 15, 2023 / 07:42 AM IST

RRR Producer DVV Danayya comments on naatu naatu winning Oscar

DVV Danayya :  RRR నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలిచి మొట్టమొదటి ఇండియన్ సాంగ్ గా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ విజయంపై అంతా సంతోషిస్తున్నారు. ఈ విజయం రావడానికి ముఖ్య కారణం రాజమౌళినే. రాజమౌళి ముందుండి సినిమాని, పాటని హాలీవుడ్ లో బాగా ప్రమోట్ చేశాడు. ఈ ప్రమోషన్స్ కి దాదాపు 80 కోట్లు ఖర్చు అయింది కూడా. అయితే RRR సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా సినిమా నిర్మాత దానయ్య కనపడలేదు.

ఈ విషయం పలుమార్లు చర్చలకు వచ్చినా ఎవరూ స్పందించలేదు. ఆస్కార్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కనపడ్డాడు. ఆ ప్రమోషన్స్ కి కావాల్సిన ఖర్చుని శోభు కూడా కొంత పెట్టుకున్నట్టు సమాచారం. దీంతో RRR టీంకి, రాజమౌళికి, దానయ్యకి మధ్య ఏం జరిగింది అని అంతా ఆలోచించారు. తాజాగా ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత అందరిలాగే దానయ్య కూడా మీడియాతో మాట్లాడారు.

95th Oscar Winners : 95వ ఆస్కార్ అవార్డు గ్రహీతలు..

దానయ్య మీడియాతో మాట్లాడుతూ.. RRR సినిమా రిలీజ్ తర్వాత చరణ్, తారక్, రాజమౌళి, RRR టీం ఎవ్వరితో నేను కాంటాక్ట్ లో లేను. కానీ నేను నిర్మించిన సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు సంతోషిస్తున్నాను అని తెలిపారు. అయితే వీరిమధ్య కాంటాక్ట్ ఎందుకు లేదో మాత్రం చెప్పలేదు. ఈ ప్రమోషన్స్ కి కావాల్సిన డబ్బులు దానయ్య పెట్టడానికి ఒప్పుకోకపోవడంతో దాని వల్లే రాజమౌళికి, దానయ్య కి మధ్య ఏదో జరిగి మాట్లాడుకోవట్లేదు అని టాలీవుడ్ టాక్. మరి RRR టీం ఇండియాకి వచ్చిన తర్వాతైనా దానయ్య టీంని కలిసి అభినందనలు చెప్తారా లేదా చూడాలి.