Rukmini Vasanth: అది నేను కాదు.. బికినీ ఫొటోలపై రుక్మిణి వసంత్ ఆగ్రహం
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)బికినీ ఫోటోలు నిజం కాదు AI క్రియేటెడ్.
- V Santhosh Kumar
- Updated on- May 23, 2026 / 05:09 PM IST
Rukmini Vasanth shocking comments on her bikini photos and videos
- రుక్మిణి వసంత్ బికినీ ఫోటోలు ఫేక్.
- ఏఐ ఫోటోలపై నటి తీవ్ర ఆగ్రహం.
- సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు.
Rukmini Vasanth: కన్నడ, తెలుగు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్ (Rukmini Vasanth). తాజాగా, ఈ బ్యూటీకి సంబందించిన బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్విమ్మింగ్ పూల్ వద్ద తాను బికినీతో ఫోటోషూట్ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు, వీడియోలు అన్నీ ముమ్మాటికీ నకిలీవని ఆమె స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి తన రూపంతో ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్‌ను సృష్టించారని ఆమె మండిపడ్డారు.
Peddi: ‘పెద్ది’ కలెక్షన్స్ పై భారీ దెబ్బ.. టికెట్ రేట్స్ పెంచేది లేదన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్
ఈ వ్యవహారంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన రుక్మిణి.. ఏఐ సాయంతో మార్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేయడం బాధ్యతారాహిత్యమని, ఇది ఒకరి వ్యక్తిగత గోప్యతను (Privacy) దారుణంగా ఉల్లంఘించడమేనని అన్నారు. ఈ విషయాన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ ఫేక్ కంటెంట్‌ను తయారు చేసిన వారితో పాటు, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై కూడా సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా కఠిన న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు రుక్మిణి వసంత్ వెల్లడించారు.
ఇటీవలి కాలంలో సినీ తారలు, మహిళా యాంకర్లను టార్గెట్ చేస్తూ ఇలాంటి ఏఐ డీప్‌ఫేక్ ఫోటోలు రావడం చిత్ర పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో కూడా హీరోయిన్ల శరీర భాగాలను జూమ్ చేస్తూ కెమెరాల్లో బంధించే సంస్కృతిపై రుక్మిణి తీవ్రంగా స్పందించారు. తాజాగా యాంకర్ అనసూయ భరద్వాజ్ సైతం తనకు సంబంధించిన ఫేక్ ఏఐ ఫోటోలపై పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇలాంటి ఫేక్ కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని నటీమణులు కోరుతున్నారు.
From the desk of #RukminiVasanth pic.twitter.com/fwcSGL4OBd
— Rukmini Vasanth (@RukminiVasantFP) May 23, 2026
