Peddi Ticket Price: ‘పెద్ది’ కలెక్షన్స్ పై భారీ దెబ్బ.. టికెట్ రేట్స్ పెంచేది లేదన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్
రామ్ చరణ్ పెద్ది(Peddi) సినిమాకు తెలంగాణాలో పెద్ద దెబ్బ.
Telangana Exhibitors Say There Will Be No Ticket Price Hike for Peddi movie
- ‘పెద్ది’ సినిమాకు టికెట్ రేట్ల షాక్.
- తెలంగాణలో రేట్లు పెంచేది లేదు.
- ‘పెద్ది’ కలెక్షన్లపై భారీ ప్రభావం.
Peddi Ticket Price: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ విడుదలకు ముందే ఊహించని భారీ షాక్ తగిలింది. ఈ సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉండటంతో ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో వస్తాయని అందరూ భావించారు. అయితే, తెలంగాణలో ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే లేదని తెలంగాణ ఎగ్జిబిటర్లు తెగేసి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపునకు మొగ్గు చూపినా, తాము మాత్రం పాత ధరలకే సినిమాను ప్రదర్శిస్తామని, ఈ మేరకు ముఖ్యమంత్రికి కూడా లేఖ రాశామని వారు స్పష్టం చేయడంతో ట్రేడ్ వర్గాల్లో కలకలం మొదలైంది.
*Peddi: ‘పెద్ది’ సినిమాకు ఎగ్జిబిటర్ల షాక్.. పర్సంటేజ్ ఇస్తేనే థియేటర్లలో ప్రదర్శన.. అల్టిమేటం జారీ
టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలంగాణనే అత్యంత కీలకమైన, పెద్ద మార్కెట్ కావడంతో ఎగ్జిబిటర్ల తాజా నిర్ణయం ‘పెద్ది(Peddi)’ బాక్సాఫీస్ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా పెద్ద సినిమాలకు మొదటి వారం పెంచిన టికెట్ రేట్లే కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. అలాంటిది తెలంగాణ లాంటి భారీ రీజియన్‌లో రేట్లు పెంచకపోతే లాంగ్ రన్లో సినిమాకు భారీగా వసూళ్లు తగ్గే ప్రమాదం పొంచి ఉంది. దీంతో చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు ఈ వార్త విన్న రామ్ చరణ్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారీ చరణ్ సినిమాల రిలీజ్ సమయంలోనే ఇలాంటి టికెట్ రేట్ల సమస్యలు, వివాదాలు ఎందుకు ఎదురవుతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సంక్షోభానికి ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది, ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపి సమస్యను సద్దుమణిగేలా చేయడానికి మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రంగంలోకి దిగుతారా లేదా అనేది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
