Russo Brothers : రాజమౌళిని కలవడం చాలా సంతోషంగా ఉంది.. ఎవెంజర్స్ డైరెక్టర్స్ ట్వీట్..
బ్రదర్స్ RRR సినిమాని మరోసారి అభినందించారు. రాజమౌళి సినిమా తీస్తాను అంటే నిర్మాతగా డబ్బులు పెట్టడానికి రెడీ అన్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ రాజమౌళితో రూసో బ్రదర్స్ కి వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూ.............
- Saketh U
- Published On : July 31, 2022 / 07:13 AM IST
Rajamouli
Rjamouli : RRR సినిమా ప్రపంచమంతటా పాకి మంచి విజయం, పేరు సంపాదించిన సంగతి తెలిసిందే. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మరింత మందికి చేరువయి మన RRR సినిమా గొప్పతనం మారుమ్రోగింది. ఈ సినిమా చూసిన చాలా మంది విదేశీ ప్రేక్షకులు, వేరే దేశాలకు చెందిన సినీ ప్రముఖులు RRR ని పొగుడుతూ ట్వీట్స్ చేశారు. ఇందులోని సీన్స్ ని, చరణ్, తారక్, రాజమౌళిని అభినందించారు. హాలీవుడ్ కి చెందిన గొప్ప గొప్ప సినీ ప్రముఖులు, టెక్నీషియన్స్ కూడా RRR పై ప్రశంశలు కురిపించారు.
ఎవెంజర్స్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన రూసో బ్రదర్స్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ కోసం ది గ్రే మ్యాన్ అనే సినిమాని తెరకెక్కించారు. తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఇందులో ఓ పాత్ర చేయడంతో దీని ప్రమోషన్స్ కోసం రూసో బ్రదర్స్ ఇండియాకి కూడా వచ్చారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రూసో బ్రదర్స్ RRR సినిమాని మరోసారి అభినందించారు. రాజమౌళి సినిమా తీస్తాను అంటే నిర్మాతగా డబ్బులు పెట్టడానికి రెడీ అన్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ రాజమౌళితో రూసో బ్రదర్స్ కి వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది. ఇందులో సినిమాలకి చెందిన పలు అంశాలపై చర్చించారు.
Jagapathi Babu : నేను రాజకీయాలకు పనికిరాను.. రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదు..
ఆ తర్వాత రూసో బ్రదర్స్ ”ది గ్రేట్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై జక్కన్న స్పందిస్తూ.. ”మిమ్మల్ని కలవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరోసారి మిమ్మల్ని కలిసి మీ క్రాప్ట్స్ నుంచి కొంత వర్క్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను” అని పోస్ట్ చేశారు. దీంతో హాలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్స్ ఇలా రాజమౌళి గురించి మాట్లాడటం, ట్వీట్స్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.
The honour and pleasure are mine..?? It was a great interaction . Looking forward to meet and learn a bit of your craft. https://t.co/NxrzuCv1w3
— rajamouli ss (@ssrajamouli) July 30, 2022
