Sandra Bullock : బర్త్ డే విషెస్ ఇలా కూడా చెబుతారా నాయనా.. మరి నగ్న వీడియోతో..!

తనతో నటించిన యాక్ట్రెస్ సాండ్రా బుల్లక్ కి యాక్టర్ ర్యాన్ రెనాల్డ్స్ బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. వారిద్దరి నగ్న వీడియోని షేర్ చేశాడు.

Sandra Bullock : మనలో చాలామంది మనకిష్టమైన వారి పుట్టినరోజుకి రకరకాలుగా బర్త్ డే విషెష్ తెలియజేస్తుంటాం. వాటిలో కొన్ని బర్త్ డే విషెస్ వావ్ అనిపించేలా ఉంటే, మరికొన్ని బలే క్రేజీ అనిపిస్తాయి. అయితే తాజాగా ఒక హాలీవుడ్ నటుడు తనతో నటించిన హీరోయిన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విధానం చూస్తే మీకు పిచ్చెక్కిపోతుంది. ఏకంగా ఇద్దరు నగ్నంగా ఉన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ఇంతకీ ఆ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఎవరంటే.. ర్యాన్ రెనాల్డ్స్ (Ryan Reynolds) అండ్ సాండ్రా బుల్లక్ (Sandra Bullock).

Jawan : శంకర్‌ని మించిపోతున్న అట్లీ.. షారుఖ్ సినిమాలో ఒక్క సాంగ్ కోసం 15 కోట్లు ఖర్చు..

నిన్న జులై 26న సాండ్రా బుల్లక్ తన 59వ పుట్టినరోజును జరుపుకుంది. ఇక ఈ భామకి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. తన తోటి యాక్టర్స్ మరియు అభిమానులు పోస్టులు పెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ర్యాన్ రెనాల్డ్స్ కూడా బర్త్ డే విషెస్ చెబుతూ.. వాళ్లిద్దరూ పూర్తిగా బట్టలు లేకుండా నగ్నంగా ఉన్న వీడియోని షేర్ చేశాడు. ఆ పోస్ట్ కి ఇలా రాసుకొచ్చాడు.. “హ్యాపీ బర్త్ డే గ్రేట్ అండ్ స్టన్నింగ్ యాక్టర్ సాండ్రా బుల్లక్‌. ఈ ఇయర్ మీ బర్త్ డే కోసం మనం ఇద్దరం కలిసి సాన్నిహిత్యంగా నటించిన సన్నివేశాన్ని తీసుకు వచ్చా” అని పోస్ట్ చేశాడు.

Kushi : విజయ్, సమంతల ఖుషి టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. తను కనబడిన, వినబడిన..!

అయితే ఈ వీడియో అసలు విషయం ఏంటంటే.. గతంలో వీరిద్దరూ కలిసి ‘ది ప్రపోజల్’ అనే సినిమాలో నటించారు. ఆ మూవీలోని ఒక సన్నివేశంలో ఇద్దరు నగ్నంగా నటించిన వీడియోనే ఇప్పుడు పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోని పోస్ట్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పడంతో ర్యాన్ పై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. కాగా ఈ సీన్ చిత్రీకరణ ఎలా జరిగిందో గతంలో వీరిద్దరూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సీన్ ని ఒక క్లోజ్డ్ సెట్ లో జరిపారు. అవసరమైన ఆర్టిస్టులు తప్ప మరెవరు లేకుండా చేసుకున్నారట. ఇక సీన్ లో పూర్తి నగ్నంగా కనిపించినప్పటికీ.. వారి ప్రైవేట్ పార్ట్స్ ని చర్మం రంగుతో కవర్ చేసినట్లు పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు