Kushi : విజయ్, సమంతల ఖుషి టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. తను కనబడిన, వినబడిన..!

విజయ్, సమంతల ఖుషి మూవీ నుంచి ఇప్పటికే ‘నా రోజా నువ్వే’, 'ఆరాధ్య' సాంగ్స్ రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ అందుకున్నాయి. తాజాగా టైటిల్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు.

Kushi : విజయ్, సమంతల ఖుషి టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. తను కనబడిన, వినబడిన..!

Vijay Deverakonda Samantha Kushi movie title song promo release

Kushi : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కలిసి నటిస్తున్న లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఖుషి’. లవ్ స్టోరీస్ ని బాగా తెరకెక్కించే శివ నిర్వాణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ‘నా రోజా నువ్వే’, ‘ఆరాధ్య’ సాంగ్స్ రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ అందుకున్నాయి. తాజాగా ఇప్పుడు మరో సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు.

Nassar – Pawan Kalyan : తమిళ్ ఇండస్ట్రీ పై పవన్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదంటున్న నాజర్.. తప్పుడు ప్రచారం..!

“ఖుషీ నువు కనబడితే, ఖుషీ నీ మాట వినబడితే”.. అంటూ సాగే ఈ పాటకి దర్శకుడు శివ నిర్వాణ లిరిక్స్ అందించాడు. గత రెండు సాంగ్స్ కి శివ నిర్వాణనే సాహిత్యం అందించగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సాంగ్ కూడా అదే రీతిలో ఉండబోతుందని అర్ధమవుతుంది. ఇక ఈ పాటని సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ పాడాడు. ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సాంగ్ ప్రోమోలని రిలీజ్ చేశారు.

Sai Dharam Tej : అభిమానులకు తేజ్ ప్రెస్ నోట్ రిలీజ్.. బ్యానర్స్ విషయంలో జాగ్రత్త వహించండి..

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. రొమాంటిక్ లవ్ స్టోరీతో ఈ మూవీ అందరి మనసులు దోచుకునేలా శివ నిర్వాణ సిద్ధం చేస్తున్నాడు. నిన్ను కోరి, మజిలీ వంటి ప్రేమ కథలతో శివ నిర్వాణ సూపర్ హిట్టు అందుకోవడంతో ఈ మూవీ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. సెప్టెంబర్ 1న ఈ మూవీని రిలీజ్ కాబోతుంది. కాగా విజయ్ అండ్ సమంత ప్రస్తుతం ప్లాప్ ల్లో ఉన్నారు. వీరిద్దరి నుంచి ఒక హిట్టు కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి వారి కోరికను ఈ మూవీ నెరవేరుస్తుందా? లేదా? చూడాలి.