Nassar – Pawan Kalyan : తమిళ్ ఇండస్ట్రీ పై పవన్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదంటున్న నాజర్.. తప్పుడు ప్రచారం..!

ఇటీవల తమిళ్ పరిశ్రమ పై బ్రో ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఖండించాడు. పవన్ వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం..

Nassar – Pawan Kalyan : తమిళ్ ఇండస్ట్రీ పై పవన్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదంటున్న నాజర్.. తప్పుడు ప్రచారం..!

Nadigar Sangam Nassar reaction on Pawan Kalyan Comments about tamil film industry

Nassar – Pawan Kalyan : ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమ.. తమిళ సినిమాల్లో తమిళ నటులు, టెక్నీషియన్స్ మాత్రమే ఉండాలి. ఆ చిత్రాలు తమిళనాడులోనే చిత్రీకరణ జరుపుకోవాలనే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇక వీటి పై బ్రో (Bro) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. “తమిళ పరిశ్రమలో ఇతర భాషల వాళ్లకు పని చేసే అవకాశం కలిపిస్తేనే, ఆ పరిశ్రమకి కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ ఇలా నిబంధనలు పెట్టుకుని ఉంటే బాహుబలి, RRR వంటి గ్లోబల్ సినిమాలు తెరకెక్కించలేము” అంటూ వ్యాఖ్యానించాడు. తాజాగా పవన్ వ్యాఖ్యలు పై నడిగర్ సంఘం (Nadigar Sangam) అధ్యక్షుడు నాజర్ ఖండించారు. అసలు అలాంటి నిబంధనలు తమిళ పరిశ్రమలో లేవని అసలు విషయాన్ని వివరించారు.

Sai Dharam Tej : అభిమానులకు తేజ్ ప్రెస్ నోట్ రిలీజ్.. బ్యానర్స్ విషయంలో జాగ్రత్త వహించండి..

నాజర్ వ్యాఖ్యలు..
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ సమాచారం తప్పుగా ప్రచారం అవుతోంది. తమిళ పరిశ్రమలో ఇతర భాషలకు చెందిన వారు పని చేయకూడదనే రూల్స్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. అలాంటి నిబంధన తీసుకు వస్తే ముందు నేనే దాన్ని ఖండిస్తాను. దాన్ని వ్యతిరేకిస్తాను. సినిమా పరిశ్రమ, కళాకారులు అనే వాళ్లకు సరిహద్దులు ఉండవు. దీన్ని ఎవరో కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నా సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని స్టేజ్ మీద చెప్పారు. ఆయనకు ఎవరో తప్పుడు సమాచారాన్ని అందించి ఉంటారు.

Sai Dharam Tej : తిక్క హీరోయిన్‌తో లవ్ స్టోరీ గురించి తేజ్ కామెంట్స్.. ఆ పేరులో ఒక వైబ్రేషన్ ఉంది..

తమిళ సినీ కార్మికుల కోసం సెల్వమణి గారు కొన్ని సూచ‌న‌లు చేశారు. తమిళ్ సినిమా చేస్తున్నప్పుడు తమిళ టెక్నీషియన్లు పెట్టుకోండని అన్నారు. అంతే కానీ ఇతర భాషల వ్యక్తులని వద్దని ఎవ్వరూ చెప్పలేదు. ఇప్పుడు ఒక భాష అని ఏం లేదు. అన్నీ కూడా ప్యాన్ ఇండియన్ సినిమాలు అయ్యాయి. ఓటీటీ వినియోగం ఎక్కువైంది. ఇలాంటి టైంలో అలాంటి నిబంధనలు ఎవరు తీసుకొస్తారు. ఇతర భాషల నుంచి వచ్చిన ఎంతో మంది ఆర్టిస్టులను, టెక్నీషియన్లను తమిళ పరిశ్రమ అక్కున చేర్చుకుంది. వారిని ఆదరించింది. ఎస్వీ రంగారావు గారు, సావిత్రి గారు, వాణీ శ్రీ గారు, శారద అమ్మ గారు ఇలా చాలా మంది తమిళులే అని అనుకున్నాను. చాలా కాలం తరువాత నాకు వాళ్లది ఆంధ్రా అని తెలిసింది. కాబట్టి ఇప్పుడు వస్తున్న ప్రచారానికి అర్థం లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మన సినిమాల గురించి ఎదురుచూస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ల కంటే పెద్ద సినిమాలను మనమందరం కలిసి తీద్దాం.