Ustaad Bhagat Singh : ముందే వచ్చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్.. ఫ్యాన్స్ కి పండగే.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?
ఈ సినిమాని చెప్పిన డేట్ కంటే ముందే రిలీజ్ చేయబోతున్నారు. (Ustaad Bhagat Singh)
Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 26 రాబోతుందని ఇటీవల ప్రకటించారు. ఎప్పట్నుంచో సాగుతున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాని చెప్పిన డేట్ కంటే ముందే రిలీజ్ చేయబోతున్నారు.
తాజాగా ఫ్యాన్స్ కి మరింత హ్యాపీనెస్ ఇస్తూ సినిమాని ముందే రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19న ఉగాది పండగ రోజు రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది.
ఆ రోజు పాన్ ఇండియా సినిమా దురంధర్ కూడా రిలీజ్ ఉంది. అయితే ఉస్తాద్ మాత్రం కేవలం తెలుగులోనే రిలీజ్ అవుతుంది. దీంతో ఉగాది పండక్కి ఫ్యాన్స్ థియేటర్స్ లో రచ్చ చేయడం గ్యారెంటీ అంటున్నారు. ఇప్పటికే హరీష్ శంకర్ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడంలో బిజీగా ఉన్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ – పవన్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.

Also Read : Mahesh Babu : చిరంజీవితో ఫ్లాప్.. డైరెక్టర్ కి ఫోన్ చేసి ఛాన్స్ ఇచ్చిన మహేష్ బాబు.. దెబ్బకి ఇండస్ట్రీ హిట్..
