Mahesh Babu : చిరంజీవితో ఫ్లాప్.. డైరెక్టర్ కి ఫోన్ చేసి ఛాన్స్ ఇచ్చిన మహేష్ బాబు.. దెబ్బకి ఇండస్ట్రీ హిట్..
గతంలో దర్శకుడి ముందు సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా హీరోలు కథ నచ్చితే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. (Mahesh Babu)
Mahesh Babu
- చిరంజీవితో తీసిన సినిమా ఫ్లాప్
- కాల్ చేసి అవకాశం ఇచ్చిన మహేష్ బాబు
- మహేష్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అదే దర్శకుడు
Mahesh Babu : ఇప్పుడంటే దర్శకులు హిట్స్ కొడితేనే సినిమా ఛాన్సులు ఇస్తున్నారు కొంతమంది హీరోలు. కానీ గతంలో దర్శకుడి ముందు సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా హీరోలు కథ నచ్చితే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. అలా మహేష్ బాబు కూడా ఓ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారు.
ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు గుణశేఖర్. మెగాస్టార్ తో గుణశేఖర్ తీసిన మృగరాజు సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ గుణశేఖర్ మీద బాగానే ఎఫెక్ట్ అయింది. కానీ ఆ సమయంలో మహేష్ బాబు గుణశేఖర్ కి ఫోన్ చేసి పిలిపించుకొని సినిమా చేద్దాం అన్నాడు. అప్పటికే గుణశేఖర్ కొన్నేళ్ల క్రితమే మహేష్ కి ఒక కథ చెప్పి ఉన్నాడు.
Also Read : Pawan Kalyan : ఛ.. హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ ఆ సినిమా చేయాల్సింది.. చేసుంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్..
Mahesh Babu
మహేష్ బాబు హీరోగా మొదటి సినిమా ఓపెనింగ్ ఫోటోలను చూసిన డైరెక్టర్ గుణశేఖర్ ఎప్పటికైనా చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో చేయాలని రాసిపెట్టుకున్న కథ గుర్తొచ్చింది. ఆ కథ మహేష్ కి సరిపోతుందనుకొని వెళ్లి చెప్పాడు. గుణశేఖర్ చెప్పిన కథ మహేష్ కి నచ్చింది కానీ అప్పటికే మహేష్ ఒక్క సినిమా కూడా హీరోగా రాలేదు, పైగా లైన్ లో కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి అని తర్వాత చేద్దాం అని చెప్పాడు మహేష్.
అలా నాలుగేళ్ళ తర్వాత గుణశేఖర్ కి మహేష్ బాబు ఆ కథని గుర్తుంచుకొని కాల్ చేసాడు. అప్పటికే చిరంజీవితో మృగరాజు ఫ్లాప్ ఉన్న మహేష్ అదేమీ పట్టించుకోకుండా అప్పుడు చెప్పిన కథని కంప్లీట్ చేయమన్నాడు. దాంతో గుణశేఖర్ స్క్రిప్ట్ పూర్తి చేసి మహేష్ కి వినిపిస్తే నచ్చేసింది. కానీ చార్మినార్ సెట్, ఇంకా కథకి బడ్జెట్ కూడా పెరిగిపోయింది. మొదట చాలా మంది నిర్మాతలు అనుకున్నా చివరికి MS రాజు ఆ సినిమాని నిర్మించారు. ఒక్కడు సినిమా ఆల్మోస్ట్ 14 కోట్లతో తెరకెక్కించారు. అప్పట్లో అది భారీ బడ్జెట్ సినిమానే.

Also Read : Raviteja : రవితేజ ఏంటి మరీ సన్నగా అయిపోయాడు.. మాస్ మహారాజ కొత్త లుక్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్..
ఆ తర్వాత ఒక్కడు ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. 14 కోట్లతో తెరకెక్కిస్తే అప్పట్లోనే ఈ సినిమా 30 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మహేష్ ని స్టార్ హీరోని చేసింది. ఆ తర్వాత గుణేశేఖర్ – మహేష్ కాంబోలో వచ్చిన అర్జున్ సినిమా మాత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి తో వారణాసి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. గుణశేఖర్ ఇటీవలే భూమికతో యుఫొరియా సినిమా తీయగా సినిమా బాగున్నా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు.
