Sai Dharam Tej : అభిమానులకు తేజ్ ప్రెస్ నోట్ రిలీజ్.. బ్యానర్స్ విషయంలో జాగ్రత్త వహించండి..
బ్యానర్స్ అండ్ భారీ కట్ అవుట్స్ ఏర్పాటు చేసే అభిమానులకు సాయి ధరమ్ తేజ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. బ్యానర్స్ విషయంలో..

Sai Dharam Tej press note for fans who arrange banners
Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తూ చేస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీ బ్రో. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సోషియో ఫాంటసీ డ్రామాగా రాబోతుంది. గోపాల గోపాల మూవీ తరువాత పవన్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్స్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేశాయి. ఈ నెల 28న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
Sai Dharam Tej : తిక్క హీరోయిన్‌తో లవ్ స్టోరీ గురించి తేజ్ కామెంట్స్.. ఆ పేరులో ఒక వైబ్రేషన్ ఉంది..
దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానుల సందడి కనిపిస్తుంది. భారీ కట్ అవుట్స్ ఏర్పాటు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక ఈ బ్యానర్స్ గురించి అభిమానులకు సాయి ధరమ్ తేజ్ కొన్ని సూచనలు ఇస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఆ నోట్‌లో.. “బ్యానర్స్ అండ్ భారీ కట్ అవుట్స్ ఏర్పాటు చేస్తూ మీరు మా పై చూపే అభిమానం మాకు అర్ధమవుతుంది. దానికి ఎప్పుడు రుణపడి ఉంటాము. అయితే ఈ ప్రేమ చూపించే క్రమంలో జాగ్రత్త వహించండి. బ్యానర్స్ ఏర్పాటు చేసే ఉత్సాహంతో ప్రమాదానికి గురి అయితే అది మమ్మల్ని ఎంతో బాధకి గురి చేస్తుంది. కాబట్టి అందరూ జాగ్రత్త ఉండండి” అంటూ పేర్కొన్నాడు.
Bholaa Shankar : రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడురా.. చిరంజీవి భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్..
మీ ప్రేమకి చాలా చాలా థాంక్స్!!!
దయచేసి జాగ్రతగా ఉండండి.#BroTheAvatar pic.twitter.com/yVb1x9ujNQ— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 27, 2023
కాగా ఇటీవల తమిళ్ హీరో సూర్య (Suriya) పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ముగ్గురు అభిమానులు.. బర్త్ డే బ్యానర్ ఏర్పాటు చేసే సమయంలో కరెంటు షాక్ కి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కుర్రాళ్ళు అక్కడిక్కడే మరణించగా, మరో కుర్రాడు మాత్రం తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఇక విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే తేజ్ ఇప్పుడు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది.