SSMB29 : మహేష్, రాజమౌళి సినిమా 2025లోనే షూటింగ్‌కి వెళ్తుందా.. నిర్మాత ఏం చెప్పాడు..!
మహేష్, రాజమౌళి సినిమా 2025లోనే షూటింగ్‌కి వెళ్తుందా. ఇంటర్వ్యూలో నిర్మాత చెప్పిన మాటలు ఏంటి..?
- gum 95921
- Published on- February 18, 2024 / 07:22 AM IST
S Gopal Reddy comments on Mahesh Babu Rajamouli SSMB 29 Movie gone viral
SSMB29 : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోతున్న సినిమా కోసం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాని ఇండియానా జోన్స్ లాంటి కథతో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో రాజమౌళి రూపొందించబోతున్నారు. కాగా ఈ చిత్రాన్ని కె ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ నిర్మాణంలో ఎస్ గోపాల్ రెడ్డి కూడా భాగం అవుతున్నారట.
రీసెంట్ గా గోపాల్ రెడ్డి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియో రిలీజ్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన SSMB29 గురించి మాట్లాడుతూ.. “రాజమౌళి నాలుగో సినిమా చేస్తున్నప్పుడే, అతను భవిషత్తులో గొప్ప దర్శకుడు అవుతాడని భావించాము. అందుకనే అతనితో సినిమా చేయాలని, నేను కె ఎల్ నారాయణ గారు ఆ సమయంలో రాజమౌళి దగ్గర సినిమా కోసం మాట తీసుకున్నాము. అతను మాతో ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. కానీ తనకి ఉన్న కమిట్మెంట్స్ వల్ల, అది లేటు అవుతూ ఇన్నాళ్లకు సెట్ అయ్యింది” అంటూ చెప్పుకొచ్చారు.
Also read : Rashmika Mandanna : చావు నుంచి తప్పించుకున్నామంటూ.. రష్మిక పోస్టు..
ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “స్క్రిప్ట్ చివరి స్టేజిలో ఉంది. వచ్చే ఏడాది మేలో షూటింగ్ మొదలవుతుంది” అని చెప్పుకొచ్చారు. ఇక ఈ మాటలు విన్న అభిమానులు షాక్ గురి అవుతున్నారు. వచ్చే ఏడాది అంటే 2025 మేలో షూటింగ్ కి వెళ్లబోతుందా..? మరి రిలీజ్ ఎప్పుడు అవుతుంది..? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో మహేష్ అభిమానుల్లో కొంచెం ఆందోళన పెరిగింది.
అయితే కొందరు వ్యక్తుల నుంచి తెలిసిన విషయం ఏంటంటే.. ఈ ఇంటర్వ్యూ గత ఏడాది (2023) చివరిలో షూట్ చేసినట్లు సమాచారం. ఆ సమయంలో గోపాల్ రెడ్డి.. గత ఏడాది అని మాట్లాడింది 2024 గురించి అని తెలుస్తుంది. ఆ ఇంటర్వ్యూని ఈ ఏడాదిలో రిలీజ్ చేయడంతోనే ఈ కన్ఫ్యూజన్ అంతా వచ్చింది. కాబట్టి మహేష్ అభిమానులు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు.
