Saakini Daakini Trailer : కామెడీతో మొదలుపెట్టి యాక్షన్ తో అదరగొట్టిన రెజీనా, నివేదా.. శాకిని డాకిని ట్రైలర్ రిలీజ్..

శాకినీ డాకిని ట్రైలర్ లో.. నివేదా ఫుడ్ లవర్ గా, రెజీనా ఓసిడి ఉన్న అమ్మాయిల్లా ఇద్దరూ ఒక పోలీస్ అకాడమీలో శిక్షణకి వస్తారు. అక్కడ మొదట వీళ్లిద్దరి మధ్య కామెడీ సన్నివేశాలు ఉంటాయి. ఆ తర్వాత ఒకరోజు రాత్రి..........

Saakini Daakini Trailer :  నివేదా థామస్, రెజీనా కసాండ్రా ముఖ్య పాత్రల్లో సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్‌ సంయుక్త నిర్మాణంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శాకిని డాకిని. దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం మిడ్‌నైట్ రన్నర్స్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా నుంచి టీజర్ రిలీజ్ కాగా సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా శాకినీ డాకిని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. శాకిని డాకిని సినిమాని సెప్టెంబర్ 16న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

శాకినీ డాకిని ట్రైలర్ లో.. నివేదా ఫుడ్ లవర్ గా, రెజీనా ఓసిడి ఉన్న అమ్మాయిల్లా ఇద్దరూ ఒక పోలీస్ అకాడమీలో శిక్షణకి వస్తారు. అక్కడ మొదట వీళ్లిద్దరి మధ్య కామెడీ సన్నివేశాలు ఉంటాయి. ఆ తర్వాత ఒకరోజు రాత్రి ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేయడం చూసి వీళ్ళు ఆ అమ్మాయిని కాపాడటానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో చాలా మంది అమ్మాయిలని కిడ్నాప్ చేశారని తెలుసుకోవడం, యాక్షన్ సీన్స్, రెజీనా, నివేదా ఫైట్ సీన్స్, చివరకు వీళ్ళని విలన్లు పట్టుకుంటారు. మరి విలన్ల నుంచి ఎలా తప్పించుకున్నారు, అమ్మాయిల కిడ్నాప్ విషయం ఏంటి అనేది తెలుసుకోవాలంటే తెరపై చూడాల్సిందే.

BiggBoss 6 : రెండో వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరో తెలుసా..? హౌస్ లో అర్ధరాత్రి దొంగతనాలు..

సినిమా ట్రైలర్ లోనే కథ మొత్తాన్ని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఇద్దరు హీరోయిన్స్ కలిసి లేడీ మల్టీస్టారర్ చేయడంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేమికులు.

ట్రెండింగ్ వార్తలు