BiggBoss 6 : రెండో వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరో తెలుసా..? హౌస్ లో అర్ధరాత్రి దొంగతనాలు..

ఇక ఈ నామినేషన్ ప్రక్రియలో ఒక్కొక్కరు ఒకరినే నామినేట్ చేయాలి. దీంతో ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని నామినేట్ చేశారు. అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన..............

BiggBoss 6 : రెండో వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరో తెలుసా..? హౌస్ లో అర్ధరాత్రి దొంగతనాలు..

BiggBoss 6 second week nominations list

BiggBoss 6 :  బిగ్‌బాస్‌ సీజన్ 6 మొదటివారం పూర్తయి రెండోవారంలోకి అడుగుపెట్టింది. సోమవారం నాడు రెండోవారం నామినేషన్స్ కూడా చేసేశారు. ఈ నామినేషన్ ప్రక్రియలో మరోసారి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరిగాయి. సాధారణంగా బిగ్‌బాస్‌ లో అమ్మాయిలు, అబ్బాయిలు క్లోజ్ అవుతారు, హగ్గులు కిస్ లు కూడా ఇచ్చుకుంటారు. కానీ ఈ సీజన్ లో తనతో అలాంటివి చేస్తే ఊరుకోను అంటుంది శ్రీ సత్య.

సోమవారం ఎపిసోడ్ లో శ్రీసత్య, శ్రీహన్, రేవంత్, అర్జున్ కళ్యాణ్ మధ్య హౌస్ గురించి చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా శ్రీసత్య మాట్లాడుతూ.. ఫ్రెండ్లీగా నా భుజం మీద టచ్ చేస్తే ఓకే, సైడ్ హగ్ ఇచ్చినా ఓకే. అంతకుమించి నన్ను నన్ను టచ్ చేయాలని చూస్తే నేను ఊరుకోను అని చెప్పింది. ఆ తర్వాత ఇనయా సుల్తానా మైక్ మిస్ అవ్వగా చాలా సేపు వెతికినా కనిపించదు. చివరకు ఇనయా మైక్ ఆర్జే సూర్య వద్ద ఉంటుంది. దీంతో ఇనయా మైక్ ని కావాలనే దాచి పెట్టారు అని కెప్టెన్ బాలాదిత్యకి కంప్లైంట్ చేసింది.

నైట్ టైంలో సూర్య, ఫైమా, ఆరోహి కలిసి అల్లరి పనులు చేస్తున్నారు. వంటగదిలో ఉన్న ఫుడ్ ని అందరూ నిద్ర పోయిన తర్వాత దొంగతనంగా వీళ్ళు ముగ్గురూ తిన్నారు. చలాకి చంటి అందరి మీద సెటైర్స్ వేస్తూ నవ్వించాడు. ఇక బిగ్‌బాస్‌ నామినేషన్ ప్రక్రియని మొదలుపెట్టాడు. ఈ సారి కంటెస్టెంట్స్ ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పి వాళ్ళ ఫోటోని కుండకు అతికించి బావిలో పడేసి నామినేట్ ఎందుకు చేశారో చెప్పాలి.

BiggBoss 6: బిగ్‌బాస్ సీజన్ 6.. రెండోవారం నామినేషన్స్ లో నిలవనుంది ఎవరు?

ఇక ఈ నామినేషన్ ప్రక్రియలో ఒక్కొక్కరు ఒకరినే నామినేట్ చేయాలి. దీంతో ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని నామినేట్ చేశారు. అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన రాజ్, షాని, అభినయ, రోహిత్ -మెరీనా, ఆది రెడ్డి, గీతూ, రేవంత్, ఫైమా ఈ వారం ఎలిమినేషన్స్ కి నామినేట్ అయ్యారు. మొదటివారం నామినేషన్ లేకపోవడంతో రెండో వారం కచ్చితంగా ఎవరో ఒకరు నామినేట్ అవుతారు అని తెలుస్తుంది. దీంతో 21 మందిలో 9 మంది ఈ వారం నామినేట్ అయ్యారు.

ఇక ఈ నామినేషన్స్ లో రేవంత్, గీతూ మధ్య పెద్ద గొడవే జరిగింది. గీతూ మొదటి నుంచి హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంలో రేవంత్ గీతూని నామినేట్ చేయడంతో నా ఇష్టమొచ్చినట్టు ఉంటాను అంటూ గీతూ మరోసారి హడావిడి చేసింది. మొత్తానికి సోమవారం నాడు గొడవల మధ్య నామినేషన్స్ పూర్తయ్యాయి. మరి ఈ వారం ఎవరు బాగా పర్ఫార్మ్ చేసి ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటారో చూడాలి.