Kalyanam Kamaneeyam Jeevitham : ‘కళ్యాణం కమనీయం జీవితం’ టీజర్ చూశారా..?

మీరు కూడా కళ్యాణం కమనీయం జీవితం టీజర్ చూసేయండి.. (Kalyanam Kamaneeyam Jeevitham)

  • Published on- July 17, 2026 / 04:04 PM IST

Kalyanam Kamaneeyam Jeevitham

Kalyanam Kamaneeyam Jeevitham : ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా తెరకెక్కుతున్న సినిమా కళ్యాణం కమనీయం జీవితం. వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల నిర్మాణంలో రవి లోకిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కి దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి, జెమినీ సురేష్.. పలువురు గెస్టులుగా హాజరయ్యారు.

మీరు కూడా కళ్యాణం కమనీయం జీవితం టీజర్ చూసేయండి..

టీజర్ లంచ్ ఈవెంట్లో డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. కళ్యాణం కమనీయం జీవితం అనే టైటిల్ చూసి మీకు పెళ్లయ్యిందా అని డైరెక్టర్ ను అడిగాను. తన లైఫ్ నుంచి ఇన్స్ పైర్ అయ్యి చేసిన సినిమా అని చెప్పారు. చాలామంది కొత్త దర్శకులు తీసే ప్రేమ కథలు వారి నిజ జీవితాల నుంచి స్ఫూర్తి పొందినవే అని అన్నారు. నిర్మాత కిషోర్ గుండాల మాట్లాడుతూ.. నేను కార్పొరేట్ ప్రపంచం నుంచి సినిమాల మీద ప్యాషన్ తో టాలీవుడ్ కు వచ్చాను. యూఎస్ లో ఫిలింమేకింగ్ మీద కోర్స్ చేశాను. గతంలో 24 కిస్సెస్ తో పాటు కొన్ని సినిమాలు తీసాము అని తెలిపారు.

డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. నా ఎన్నో ఏళ్ల కష్టం ఈ సినిమా వెనక ఉంది. నా నిజ జీవితంలోని కొన్ని ఇన్సిడెంట్స్ కు ఫిక్షనల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాని తీసాను. ఈ కథ రాసినప్పుడు రైటర్ అరవింద్ ఒక కొత్త పాయింట్ ను యాడ్ చేశాడు. ఆ పాయింట్ తో మూవీ స్క్రిప్ట్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది అని తెలిపారు.