Sai Dharam Tej : డాన్స్ పై వచ్చిన ట్రోల్స్.. సాయి ధరమ్ రియాక్షన్.. నా బాడీకి తగ్గట్టు నేను చెయ్యాలి గాని..!
ఇటీవల రిలీజ్ అయిన బ్రో మూవీ సాంగ్స్ లో సాయి ధరమ్ తేజ్ డాన్స్ పై ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై తేజ్ రియాక్ట్ అయ్యాడు.
- gum 95921
- Published On : July 18, 2023 / 06:58 PM IST
Sai Dharam Tej comments on trolls about his dance in bro movie
Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ ఇటీవలే విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు బ్రో (Bro) మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ వినోదయ సిత్తంకి రీమేక్ గా వస్తుంది. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చాయి. అయితే టీజర్ ఆకట్టుకున్నంతగా సాంగ్స్ ప్రేక్షకులను అలరించలేకపోయాయి.
ఈ సినిమా నుంచి ‘మై డియర్ మార్కండేయ’, ‘జాణవులే’ అనే రెండు సాంగ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. మార్కండేయ పవన్ అండ్ తేజ్ కాంబినేషన్ లో ఉంటే, జాణవులే తేజ్ అండ్ హీరోయిన్ కేతిక శర్మ మధ్య సాగుతుంది. ఇక రెండు సాంగ్స్ లో సాయి ధరమ్ తేజ్ డాన్స్ గురించి సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా వీటిపై తేజ్ ఒక ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యాడు. సాయి ధరమ్ గతంలో బైక్ యాక్సిడెంట్ కి గురై కొన్నాళ్ళు నడవలేని పొజిషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.
Sai Dharam Tej : నా లవ్ ఫెయిల్యూర్స్‌ని కూడా ఫ్యామిలీలో ఆయనతోనే షేర్ చేసుకుంటా..
ఆ ప్రమాదం నుంచి తేజ్ ఇంకా రికవరీ అవ్వలేదట. సాయి ధరమ్ మాట్లాడుతూ.. “అసలు నిలబడలేని పొజిషన్ నుంచి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాను. బాడీకి తగ్గట్టు నేను పని చెయ్యాలి గాని, మనకి తగ్గట్టు బాడీ సహకరించదు కదా? విరూపాక్ష సమయంలో నాకు నోటి నుంచి మాట కూడా సరిగా వచ్చేదు కాదు. కానీ ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాను. అలాగే డాన్స్ కూడా విషయంలో కూడా నాకు కొంత సమయం కావాలి” అని తెలియజేశాడు. కాగా సాయి ధరమ్ కి మరో సర్జరీ చేయాల్సి ఉందట. దీని కోసం ఈ చిత్రం తరువాత ఆరునెలలు గ్యాప్ తీసుకోబోతున్నట్లు కూడా వెల్లడించాడు.
