Sai Dharam Tej : నా లవ్ ఫెయిల్యూర్స్‌ని కూడా ఫ్యామిలీలో ఆయనతోనే షేర్ చేసుకుంటా..

బ్రో మూవీ ప్రమోషన్స్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్.. తన లవ్ ఫెయిల్యూర్స్ అండ్ వాటిని ఎవరితో షేర్ చేసుకుంటాడో అనే విషయాలు గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Sai Dharam Tej : నా లవ్ ఫెయిల్యూర్స్‌ని కూడా ఫ్యామిలీలో ఆయనతోనే షేర్ చేసుకుంటా..

Sai Dharam Tej about his love stories and share with pawan kalyan

Updated On : July 18, 2023 / 5:19 PM IST

Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలయికలో తెరకెక్కుతున్న తమిళ్ రీమేక్ మూవీ ‘బ్రో’ (Bro). తమిళ్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖని.. ఈ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేశాడు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ ఒక ప్రముఖ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు.

Bro Movie : బ్రో సినిమాలో పవన్ రన్ టైం ఎంతో తెలుసా..? పవన్ స్క్రీన్ పై కనిపించేది..

ఇక ఈ ఇంటర్వ్యూలో పవన్ తో తన బాండింగ్ మరియు సినిమా సెట్ లో జరిగిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. పవన్ ని తేజ్ ఎలా అభిమానిస్తాడో అందరికి తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ తన గురువు అంటూ చాలా ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ ఇంటర్వ్యూలో.. పవన్ తనకి తండ్రి స్థానంలో ఉన్న గురువు గారు అని, పవన్ తో ప్రతి విషయం షేర్ చేసుకుంటాని చెప్పుకొచ్చాడు. ఆఖరికి తనకి జరిగిన లవ్ ఫెయిల్యూర్స్‌ గురించి కూడా పవన్ తోనే షేర్ చేసుకుంటాను అంటూ వెల్లడించాడు.

Sai Dharam Tej : అసలు ఎప్పుడు ఫోన్ చేయని పవన్.. తేజ్‌కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని.. పెద్ద షాక్ ఇచ్చాడట..!

ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా జరిగిన లవ్ ఫెయిల్యూర్స్ గురించి కూడా పవన్ తో షేర్ చేసుకున్నారా? అని మీడియా పర్సన్ అడిగారు. దానికి తేజ్ బదులిస్తూ.. “ప్రస్తుతం ప్రేమ వ్యవహారాలు ఏమి లేవండి. సినిమాలతోనే సరిపోతుంది. అయినా అలాంటివి ఏమన్నా ఉంటే ముందుగా మీకే తెలుస్తుందిగా” అంటూ వ్యాఖ్యానించాడు. కాగా సాయి ధరమ్ గతంలో తనతో పాటు ‘తిక్క’ సినిమాలో నటించిన హీరోయిన్ ని ప్రేమించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.