×
Ad

Sai Dharam Tej : సెవన్ ఇయర్స్ ఫర్ సుప్రీం హీరో..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నేటితో నటుడిగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాడు..

  • Published On : November 14, 2021 / 12:19 PM IST

7 Years Of Sdt In Tfi

Sai Dharam Tej: మెగా మేనల్లుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే సుప్రీం హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. వైవిఎస్ చౌదరి ‘రేయ్’ మూవీ తేజ్ నటించిన ఫస్ట్ ఫిలిం అయినా ‘పిల్లా నువ్వులేని జీవితం’ ముందుగా రిలీజ్ అయ్యింది. 2014 నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తర్వాత ‘రేయ్’ విడుదలైంది. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’, సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. ‘తిక్క’, ‘విన్నర్’, ‘నక్షత్రం’, ‘జవాన్’, ‘ఇంటిలిజెంట్’, ‘తేజ్ ఐ లవ్ యూ’ వంటి సినిమాలు వరుసగా నిరాశపరిచాయి.

కట్ చేస్తే.. ‘చిత్రలహరి’ తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. ‘ప్రతిరోజూ పండగే’ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకున్నాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ తర్వాత ‘రిపబ్లిక్’ లో మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్‌తో అలరించాడు. రోడ్డు ప్రమాదానికి గురై.. ఇటీవలే పూర్తిగా కోలుకున్నాడు తేజ్.

2021 నవంబర్ 14తో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సందర్భంగా.. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, తేజ్ అభిమానులు, ఇండస్ట్రీ వారు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.