×
Ad

Sai Dharam Tej : అభిమాని మరణం.. విరూపాక్ష టీజర్ రిలీజ్ పోస్ట్‌పోన్ చేసి గొప్ప మనసు చాటుకున్న సాయి ధరమ్..

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు ‘విరూపాక్ష’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ టీజర్ ని నేడు (మార్చి 1) రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ టీజర్ రిలీజ్ ని పోస్ట్‌పోన్ చేస్తూ ప్రకటించారు.

  • Published On : March 1, 2023 / 01:34 PM IST

Sai Dharam Tej postpone his movie Virupaksha teaser release due to his fan sudden demise

Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు ‘విరూపాక్ష’ అనే సినిమాతో రాబోతున్నాడు. సాయి ధరమ్ 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మిస్టికల్ కథాంశంతో ఉండబోతుంది. ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే వరుస అప్డేట్ లు ఇస్తూ మూవీ పై బజ్ కలిగేలా చేస్తున్నారు. కాగా ఈ మూవీ టీజర్ ని నేడు (మార్చి 1) రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ టీజర్ రిలీజ్ ని పోస్ట్‌పోన్ చేస్తూ ప్రకటించారు.

Virupaksha : విరూపాక్ష టీజర్ చూసిన పవన్ కళ్యాణ్.. టీంకి అభినందనలు!

భీమవరం సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్ ప్రెసిడెంట్ రావూరి పండు నిన్న (ఫిబ్రవరి 28) మరణించాడు. 28 ఏళ్ళ రావూరి పండు క్రికెట్ ఆడుతూ హార్ట్ ఎటాక్ వచ్చి మృతి చెందాడు. ఇక విషయం తెలుసుకున్న సాయి ధరమ్ స్పందిస్తూ.. ‘రావూరి పండు అకాల మరణం మనసుకి చాలా బాధ కలిగిస్తుంది. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, అభిమాని మరణాన్నికి చింతిస్తూ తన సినిమా టీజర్ రిలీజ్ ని కూడా పోస్ట్‌పోన్ చేసుకున్నాడు. దీంతో అభిమానుల పట్ల సాయి ధరమ్ చూపిస్తున్న ప్రేమకు హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజెన్లు.

కాగా టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఇంకా తెలియజేయలేదు. ఇక ఈ టీజర్ ని నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చూపించగా.. పవన్ చిత్ర యూనిట్ ని అభినందించాడు అంటూ ఒక వీడియో రిలీజ్ చేసి తెలియజేశారు. ఈ మూవీకి టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందిస్తుండగా, అతడి శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా మరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.