‘సూర్యకాంతం’ సాంగ్స్‌ రిలీజ్ చేసిన సాయి ధరమ్ తేజ్

  • Publish Date - March 26, 2019 / 11:30 AM IST

నిహారిక‌, రాహుల్ విజ‌య్, ప‌ర్లీన్ బ‌సానియా ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన చిత్రం సూర్య‌కాంతం. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ చిత్రాలతో సరైన హిట్ అందుకోలేకపోయిన నిహారిక ఈసారి గట్టి హిట్ కొట్టేందుకు ‘సూర్యకాంతం’ అంటూ ప్రేక్షకుల్ని అలరించబోతుంది. నిహారిక కొణిదెల, రాహుల్‌ విజయ్‌ జంటగా ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూర్యకాంతం’ ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇటీవల ‘సూర్యకాంతం’ ప్రీ రిలీజ్ హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్‌‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్‌గా రావడంతో ‘సూర్యకాంతం’ చిత్రానికి హైప్ వచ్చింది. కాగా ఈ మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తూ ఈ చిత్రంలో సాంగ్స్‌ని జూక్ బాక్స్ ద్వారా విడుదల చేశారు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. మొత్తం ఆరుపాటలతో ఉన్న ఈ పాటల ఆల్బమ్‌కి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. అన్ని పాటలకు క్రిష్ణకాంత్ లిరిక్స్ అందించారు.

ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి మధ్య సాగే ప్రేమ కథే ఈ సినిమా. నేటి ట్రెండ్ కి తగ్గట్లుగా సినిమా కథను ఎన్నుకున్నాడు దర్శకుడు. ఒక అబ్బాయి ఇద్దరి అమ్మాయిలను ఇష్టపడతాడు. అందులో ఒకరు డిమాండింగా, బోల్డ్ గా ప్రవర్తిస్తే మరొకరు సెన్సిబుల్ గా ఉంటారు. వీరిద్దరిలో హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడనేదే సినిమా. వరుణ్ తేజ్ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా…నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై సినిమాను తెరకెక్కించారు. ప్రణీత్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.