Bro trailer launch event : మీ ప్రేమ కోసమే వచ్చా.. ట్రైలర్ శాంపిల్ మాత్రమే.. సినిమాలో మరెన్నో సర్‌ప్రైజ్‌లు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘బ్రో’. తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖని డైరెక్షన్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : July 22, 2023 / 07:23 PM IST
Sai Dharam Tej
Bro Movie trailer launch event : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘బ్రో’(Bro). తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖని (Samuthirakani) డైరెక్షన్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ సినిమాకి థమన్ సంగీత దర్శకుడు కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్ర్కీన్ ప్లే అందించారు. కేతిక శర్మ(Ketika Sharma) హీరోయిన్ కాగా.. జూలై 28న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.
ఈ నేపథ్యంలో ఒకేసారి రెండు చోట్లా.. వైజాగ్ లోని జగదాంబ థియేటర్ లో, హైదరాబాద్‌లోని దేవి థియేటర్‌లో ట్రైలర్ విడుదల కార్యక్రమాలను నిర్వహించారు. అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగిన వేడుకల్లో సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, సముద్ర ఖని, థమన్, టీజీ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Devara : దేవరకు తలనొప్పిగా మారిన ఫ్యాన్స్.. చిత్ర బృందం కీలక నిర్ణయం..!
వైజాగ్ జగదాంబ థియేటర్ లో జరిగిన వేడుకలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. అభిమానుల ప్రేమను పొందడం కోసం ఇంత దూరం వచ్చినట్లు తెలిపారు. ఇక అందరికి ట్రైలర్ నచ్చడం చాలా సంతోషంగా ఉందన్నారు. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుటు జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్‌కు సూచించాడు. అభిమానులకి ఏమైనా జరిగితే తాము తట్టుకోలేమని చెప్పారు. తన మేన మామ పవన్ కళ్యాణ్ చెప్పిన ఫేమస్ డైలాగ్ ‘నాకు కొంచెం తిక్కుంది’ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను అలరించారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ట్రైలర్ ఎంతగా అలరించిందో దానికి వంద రెట్లు సినిమా ఆకట్టుకుంటుదని చెప్పారు.
హైదరాబాద్ దేవి థియేటర్‌లో జరిగిన వేడుకలో సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల.. మాట్లాడుతూ ఇది చాలా మంది సినిమా అని, ఫలితం పై గట్టి నమ్మకంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అభిమానులు దేవుడిగా భావించే పవన్ కళ్యాణ్ దేవుడిగా నటించిన సినిమా ఇది అని అన్నారు. ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్‌గా నిలుస్తుందన్నారు.
ట్రైలర్ కేవలం శాంపుల్ మాత్రమే అని, సినిమాలో మరెన్నో సర్‌ప్రైజ్‌లు ఉంటాయని, పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారని సంగీత దర్శకుడు థమన్ అన్నారు. ఈ సినిమా కోసం అందరిలాగే తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్లి ఆనందించదగ్గ చిత్రమిదని హీరోయిన్ కేతిక శర్మ అంది.
Bro Trailer : బ్రో ట్రైలర్ ఆగయా.. మామా అల్లుడు కుమ్మేసారుగా..
