×
Ad

Virupaksha : 100 కోట్ల క్లబ్ లోకి సుప్రీం హీరో ఎంట్రీ.. విరూపాక్ష 100 కోట్ల కలెక్షన్స్..

ఇటీవల మన హీరోలంతా హిట్ కొడితే 100 కోట్ల కలెక్షన్స్ వసూళ్లను టార్గెట్ పెట్టుకున్నారు. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా కూడా తాజాగా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

  • Published On : May 18, 2023 / 01:22 PM IST

Sai Dharam Tej virupaksha movie collects 100 crores

Sai Dharam Tej : హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ఇటీవల విరూపాక్ష(Virupaksha) సినిమాతో ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంయుక్త మీనన్(Samyuktha Menon) ఇందులో హీరోయిన్ గా నటించగా కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్స్ లో ప్రేక్షకులని భయపెట్టి సస్పెన్స్, థ్రిల్లింగ్, ట్విస్టులతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది.

యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టడంతో మెగా అభిమానులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. విరూపాక్ష సినిమా మొదటి రోజు ఏకంగా 12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి కొన్ని రోజుల తర్వాత పాన్ ఇండియా రిలీజ్ చేశారు. వేరే భాషల్లో కూడా విరూపాక్ష సినిమాకు మంచి ఆదరణ లభించింది.

Kangana Ranaut : దేశ వ్యతిరేకుల గురించి మాట్లాడినందుకు.. సంవత్సరానికి 40 కోట్లు నష్టపోతున్నాను.. అయినా సరే..

ఇక ఇటీవల మన హీరోలంతా హిట్ కొడితే 100 కోట్ల కలెక్షన్స్ వసూళ్లను టార్గెట్ పెట్టుకున్నారు. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా కూడా తాజాగా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. విరూపాక్ష సినిమా రిలీజ్ చేసి మరో మూడు రోజుల్లో నెలరోజులు కావొస్తుంది. ఈ లోపే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఫుల్ ప్రాఫిట్ లో ఉంది. దీంతో సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో విరూపాక్ష సినిమా మొదటి 100 కోట్ల సినిమా అయింది. తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ గతంలోనే మొదటి సినిమా ఉప్పెనతోనే 100 కోట్లు సాధించిన సంగతి తెలిసిందే.