Sai Dharam Tej : ఇద్దరు చిన్నారుల ట్రీట్మెంట్ కోసం సాయి ధరమ్ తేజ్ సాయం
సాయి ధరమ్ తేజ్ రియల్ హీరో అనిపించుకున్నారు. ఇద్దరు చిన్నారుల ట్రీట్మెంట్‌కి సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.
- Lakshmi 10tv
- Published On : February 23, 2024 / 02:50 PM IST
Sai Dharam Tej
Sai Dharam Tej : రీల్ లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటున్నారు సాయి ధరమ్ తేజ్. ఇటీవల ఇద్దరు చిన్నారుల ట్రీట్మెంట్ కోసం వెంటనే స్పందించిన తేజ్ తనవంతు సాయం అందించారు. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Ananya Nagalla : పిల్లబచ్చాలు మా సినిమాకి రావొద్దు.. అనన్య నాగళ్ళ అంత మాట అనేసిందేంటి..
సాయి ధరమ్ తేజ్ బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. రిపబ్లిక్, విరూపాక్ష, బ్రో సినిమాలు వరుసగా వచ్చిన ఎక్స్‌పెక్ట్ చేసినట్లు ఆడలేదు. తాజాగా డైరెక్టర్ సంపత్ నందితో సాయి ధరమ్ తేజ్ ‘గాంజా శంకర్’ అనే సినిమా చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ సర్వీసులో ముందుంటారు ఈ హీరో. రీసెంట్‌గా సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. తనకు తెలిసిన ఒక అనాధ శరణాలయం నుండి ఇద్దరు చిన్నారుల ట్రీట్మెంట్‌కి సాయం కావాలంటూ కాల్ వచ్చిందట. వెంటనే సాయి ధరమ్ తేజ్‌కు ఒక మెసేజ్ పెట్టగానే వెంటనే సాయం చేసారట. ‘లవ్ యూ తేజ్’ అంటూ ఆండ్రూ బాబు ట్వీట్ చేశారు.
Mrunal Thakur : సింపుల్ లుక్స్‌లో వావ్ అనిపిస్తున్న మృణాల్..
అంతే కాదు సాయి ధరమ్ చేసిన సాయానికి కృతజ్ఞతగా ఆ ఆర్ఫనేజ్ పిల్లలు ధన్యవాదాలు చెబుతూ ఒక వీడియోను పంపారు. ఆ వీడియోను ఆండ్రూ బాబు తన ట్వీట్‌కి యాడ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయి ధరమ్ తేజ్ చేసిన మంచి పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.
Thank you @IamSaiDharamTej your kind help for them, children sent you thank you wishes❤️❤️❤️ pic.twitter.com/gwrzmZQYR7
— I.Andrew babu (@iandrewdop) February 22, 2024
