Sambarala Yeti Gattu : మెగాస్టార్ పై పోటీకి మెగా మేనల్లుడు.. సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ రిలీజ్ డేట్ అనౌన్స్..
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. (Sambarala Yeti Gattu)
- Saketh U
- Updated on- August 15, 2026 / 05:31 PM IST
Sambarala Yeti Gattu
Sambarala Yeti Gattu : మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నాడు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాణంలో రోహిత్ కేపీ దర్శకత్వంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. సాయి దుర్గ తేజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ దాదాపు 120 కోట్లతో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది సంబరాల ఏటిగట్టు. పీరియాడిక్ సినిమాగా రానుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
దీంతో సంక్రాంతి బరిలో ఈసారి కూడా గట్టి పోటీ ఉండబోతుంది. సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగ మాత్రమే కాదు సినిమాల పండగ కూడా. సంక్రాంతికి సినిమా వస్తే హిట్ గ్యారెంటీ. ఒకవేళ సినిమా బాగోకపోయినా కలెక్షన్స్ వచ్చేస్తాయి. 2027 సంక్రాంతికి ఇప్పటికే అధికారికంగా అనిల్ రావిపూడి వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో తీస్తున్న సినిమాని ప్రకటించారు. శర్వానంద్ – శ్రీనువైట్ల జార్జ్ క్రిష్ సినిమా కూడా సంక్రాంతికే ప్రకటించారు. అధికారికంగా ప్రకటించకపోయినా బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా కూడా సంక్రాంతికే అని సమాచారం. దీంతో మామయ్య మెగాస్టార్ పై మెగా మేనల్లుడు పోటీకి దిగుతాడా? చిరు సినిమా సంక్రాంతికి రావట్లేదు అని తెలుసుకొని ఈ డేట్ అనౌన్స్ చేసారా అని చర్చగా మారింది.
వీటితో పాటు తేజ సజ్జా సినిమా ఒకటి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ సినిమా ఒకటి కూడా సంక్రాంతి బరిలో ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. వీటితో పాటు కమల్ హాసన్ నిర్మిస్తున్న రజనీకాంత్ సినిమా కూడా వచ్చే సంక్రాంతికే. దీంతో 2027 సంక్రాంతి ఫుల్ ప్యాక్ అయింది. మరి ఆ సమయానికి ఎవరు మిగులుతారో, ఎవరు తప్పుకుంటారో చూడాలి.
Also See : Gomathy Reddy : ‘పళ్ళబురుసు’ మూవీ హీరోయిన్.. తెలుగమ్మాయి గోమతి రెడ్డి ఫొటోలు చూశారా..?
