Sai Pallavi: సాయి పల్లవి సినిమా డిజాస్టర్.. మరీ ఇంత దారుణంగానా?

ఏక్ దిన్ సినిమా ప్లాప్ వల్ల సోషల్ మీడియాలో సాయి పల్లవి(Sai Pallavi)ని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.

sai pallavi and junaid khan ek din movie get disaster response

  • సాయి పల్లవి హిందీ ఎంట్రీ నిరాశ.
  • బాక్సాఫీస్ వద్ద పడిపోయిన కలెక్షన్లు.
  • బాలీవుడ్ మొదటి సినిమా భారీ అపజయం

Sai Pallavi: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు దీటైన క్రేజ్ సంపాదించుకున్న నటి ఎవరైనా ఉన్నారంటే అది సాయి పల్లవి అనే చెప్పాలి. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండే ఈ చిన్నది నటనకు స్కోప్ ఉండే పాత్రలనే ఎంచుకుంటూ తనదైన పంథాలో సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే, కొంతకాలంగా సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన ‘ఏక్ దిన్’ అనే సినిమా చేసింది.

Vijay- Chiranjeevi: విజయ్ తండ్రితో చిరంజీవి అనుబంధం.. ఆ అవకాశం ఇచ్చింది చిరునే.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే?

భారీ అంచనాల మధ్య ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమీర్ ఖాన్ స్వయంగా నిర్మించిన ఈ సినిమాతో సాయి పల్లవి(Sai Pallavi) నార్త్‌లో కూడా జెండా పాతడం ఖాయమని అందరూ భావించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా తొలిరోజే కేవలం రూ.1.37 కోట్ల వసూళ్లతో ఫేలవంగా స్టార్ అయ్యింది. రెండో రోజు ఆ వసూళ్లు కోటి రూపాయలకు పడిపోగా, మూడో రోజు మరింత క్షీణించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు వచ్చిన స్పందన చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ఇది ఎక్కువ కాలం నిలబడే సూచనలు కనిపించడం లేదు. దక్షిణాదిలో తిరుగులేని ఇమేజ్ ఉన్న ఈ ‘నేచురల్ బ్యూటీ’కి హిందీ మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో స్వాగతం లభించలేదనే చెప్పాలి. సౌత్‌లో సాయి పల్లవి పేరు చెబితే థియేటర్లు నిండిపోతాయి, కానీ నార్త్‌లో తన తొలి ప్రయత్నానికే గట్టి ఎదురుదెబ్బ తగలడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కంటెంట్ పరంగా ఆకట్టుకోకపోవడం లేదా ప్రమోషన్ల లోపం వల్ల ఈ సినిమా వెనుకబడి ఉండవచ్చు. ఏదేమైనా, తన మొదటి హిందీ చిత్రంతోనే సాయి పల్లవి భారీ అపజయాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తుండటం ఆమె అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. మరి ఆమె చేస్తున్న రామాయణ ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుంది అనేది చూడాలి.