NC23 : నాగచైతన్య మూవీలోకి సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చిందా..? వీడియో వైరల్..

నాగచైతన్య NC23 మూవీలకి సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చిందా..? మూవీ టీం పోస్ట్ చేసిన వీడియో..

Sai Pallavi as heroine in Naga Chaitanya chandoo mondeti NC23

NC23 : అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం గీతాఆర్ట్స్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న చిత్ర యూనిట్.. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది. 2018లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. గుజరాత్ విరావల్ నుండి 21 మంది మత్స్యకారులు వేటకెళ్లి అనుకోకుండా పాక్ (Pakistan) కోస్ట్ గార్డ్‌ చెరలో చిక్కుకున్నారు. వారిలో ఎచ్చెర్ల మండలం కె మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారుడు గణగల్ల రామరావు అనే వ్యక్తి కూడా ఉన్నాడు.

Rajamouli : రాజమౌళి నెక్స్ట్ సినిమా.. ‘మేడ్ ఇన్ ఇండియా’.. ఇండియన్ సినిమాపై బయోపిక్..

అతడి లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని దాని చుట్టూ ఒక అందమైన కథని అల్లుకొని దర్శకుడు ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ ని ఎంపిక చేశారు. హీరోయిన్ ఎవరు అన్నది చెప్పకుండా కేవలం ఎంట్రీని మాత్రం తెలియజేస్తూ ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియో పోస్ట్ చూసిన నెటిజెన్స్.. ఆమె సాయి పల్లవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు అన్నది క్లారిటీ లేదు గాని, ఆడియన్స్ లో సాయి పల్లవి అని మంచి క్రేజ్ ఏర్పడింది.

Berlin : ‘మనీ హైస్ట్’ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘బెర్లిన్’ వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ అనౌన్స్..

గతంలో నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ‘లవ్ స్టోరీ’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో ఈ కాంబినేషన్ ని ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాలో ఈ జంట మరోసారి కనిపించబోతున్నారని తెలియడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకుంది. మరి మూవీ టీం సాయి పల్లవి పేరు చెబుతారా..? లేదా..? చూడాలి. అలాగే ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమా కోసం నాగచైతన్య చాలా కష్టపడుతున్నాడు. ఈ మూవీలో తన పాత్ర కోసం చాలా హోమ్ వర్క్ చేస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు