Sai Pallavi: తెరపైకి మరో క్రేజీ బయోపిక్.. హీరోయిన్ గా సాయి పల్లవి.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ లో రానున్న మరో క్రేజీ బయోపిక్ లో నటించే అవకాశం దక్కించుకున్న సాయి పల్లవి(Sai Pallavi).

Sai Pallavi doing female lead in Sanjay Leela Bhansali Madhubala biopic

  • బాలీవడ్ లో మరో బయోపిక్
  • మధుబాల బయోపిక్ సాయి పల్లవి
  • స్టార్ డైరెక్టర్ తో సూపర్ ఛాన్స్

Sai Pallavi: మలయాళ బ్యూటీ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం. భాషలతో సంబంధం లేకుండా, కేవలం తన నటనతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. గ్లామర్ కంటే పాత్ర ప్రాధాన్యతకే పెద్దపీట వేసే ఈ టాలెంటెడ్ బ్యూటీ, ఇప్పుడు మరో భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను దక్కించుకోబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయ సినీ చరిత్రలో ధ్రువతారగా వెలిగిన అలనాటి అందాల నటి మధుబాల బయోపిక్‌లో సాయిపల్లవి నటించబోతున్నట్లు సమాచారం.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించబోతుండటం విశేషం. నిజానికి ఈ పాత్ర కోసం తొలుత కియారా అడ్వాణీ, అనీత్‌ పడ్డా వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కానీ, మధుబాల పాత్రలో ఉండే గాంభీర్యం, సహజ సిద్ధమైన నటనను పండించాలంటే సాయి పల్లవి(Sai Pallavi) అయితేనే కరెక్ట్ అని భన్సాలీ భావిస్తున్నాడట. దర్శకుడు భన్సాలీ తన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను ఎంతో పవర్‌ఫుల్‌గా, కళాత్మకంగా తీర్చిదిద్దుతారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Pawan Kalyan: ప్లాప్ డైరెక్టర్ కి మాటిచ్చిన పవన్.. సినిమా చేయాల్సిందేనా.. ఈ టైంలో అవసరమా అంటున్న ఫ్యాన్స్

గతంలో, ఆయన తెరకెక్కించిన ‘పద్మావత్’, ‘గంగూబాయి కాఠియావాడి’ చిత్రాలే దీనికి నిదర్శనం. ఇప్పుడు మధుబాల లాంటి ఐకానిక్ పాత్రను సాయిపల్లవి చేతుల్లో పెడుతున్నారంటే, ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సాయిపల్లవి కూడా చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో ఆమె చేసిన ‘ఏక్ దిన్’ సినిమాతో త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

అలాగే భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’లో సీతగా నటిస్తోంది. అటు కోలీవుడ్‌లో ధనుష్‌తో కలిసి మరో సినిమాలో కూడా చేస్తోంది. ఈ క్రమంలో భన్సాలీ చిత్రానికి డేట్స్ అడ్జస్ట్ చేయడం సాయిపల్లవికి ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి. షెడ్యూళ్లు, కాల్షీట్లు అన్నీ కుదిరితే ఈ అద్భుతమైన బయోపిక్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇది పట్టాలెక్కితే, సాయిపల్లవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం.