Sai Pallavi : ఏంటి మా ఇంటి బంగారం పార్ట్ 2లో హీరోయిన్ సమంత కాదా? సాయి పల్లవితో..? ఇదెక్కడి ట్విస్ట్..

మా ఇంటి బంగారం 2 గురించి ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్‌ టాక్ నడుస్తోంది.(Sai Pallavi)

  • Published on- June 27, 2026 / 09:56 PM IST

Sai Pallavi

Sai Pallavi : సమంత ఇటీవల మా ఇంటి బంగారం సినిమాతో వచ్చి ఘన విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా ల్మోస్ట్ 70 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాత రాజ్ నిడిమోరు అధికారికంగానే సక్సెస్ మీట్ లో ప్రకటించారు. ఆల్రెడీ ఒక లైన్ కూడా అనుకున్నాము త్వరలోనే మొదలుపెడతాము అని చెప్పారు.

దీంతో మా ఇంటి బంగారం 2 గురించి ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్‌ టాక్ నడుస్తోంది. ఈసారి కథను ఇంకా పెద్ద స్కేల్‌లో, డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తీసుకురాబోతున్నారట. అయితే దీనికి సీక్వెల్ లేదా, ప్రీక్వెల్ ఉండొచ్చు, సమంత ఫ్లాష్ బ్యాక్ తో స్టోరీ రాస్తారు అని ఒక టాక్ నడుస్తుంది. అయితే ఇదే టైమ్‌లో సమంత ప్రెగ్నెన్నీ ఉండటంతో పార్ట్ 2లో ఆమె నటిస్తుందా లేక మరో హీరోయిన్‌ తీసుకుంటారా అనేది సస్పెన్స్‌గా మారింది.

Also Read : Nivetha Thomas : ఒక పక్క అక్క.. మరో పక్క లవర్‌.. ఫొటోలు షేర్ చేసిన నివేదా థామస్ తమ్ముడు..

మా ఇంటి బంగారం ప్రాజెక్ట్‌ ఓకే అయినప్పుడే లీడ్‌ రోల్‌ కోసం సాయిపల్లవినే ఫస్ట్ ఛాయిస్ అనుకున్నామని, ఆమె బిజీగా ఉండటంతో సమంతను ఒప్పించి మా ఇంటి బంగారం మూవీ చేయించామని రాజ్ తెలిపాడు. దీంతో పార్ట్ 2లో సాయిపల్లవి ఎంట్రీ ఇవ్వొచ్చని గాసిప్స్ ఊపందుకున్నాయి. ముఖ్యంగా నేచురల్ పెర్ఫార్మెన్స్, ఫ్యామిలీ ఎమోషన్ కలిపి సాయిపల్లవి స్టైల్‌కు ఈ కథ సూట్ అవుతుందనే అనుకుంటున్నారు.

ఇప్పటికైతే ఇది ఇండస్ట్రీ గాసిప్‌గానే ఉంది. మరి ఇంటి బంగార్ పార్ట్‌ 2లో సాయిపల్లవిని తీసుకుంటారా? లేక సమంత డెలివరీ అయి వచ్చేవరకు ఎదురుచూస్తారా అనేది అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.